గోరుచిక్కుడుకాయ కూర ఎండు కొబ్బరి పొడి వేసి | cluster. Beans with coconut powderurry Recipe in Telugu

ద్వారా Shobha.. Vrudhulla  |  21st Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • cluster. Beans with coconut powderurry recipe in Telugu,గోరుచిక్కుడుకాయ కూర ఎండు కొబ్బరి పొడి వేసి, Shobha.. Vrudhulla
గోరుచిక్కుడుకాయ కూర ఎండు కొబ్బరి పొడి వేసిby Shobha.. Vrudhulla
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

3

0

గోరుచిక్కుడుకాయ కూర ఎండు కొబ్బరి పొడి వేసి వంటకం

గోరుచిక్కుడుకాయ కూర ఎండు కొబ్బరి పొడి వేసి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make cluster. Beans with coconut powderurry Recipe in Telugu )

 • గోరుచిక్కుడు కాయలు అర కిలో
 • కొబ్బరి కోరు ఎండుది రెండు కప్పులు..పచ్చి కొబ్బరి అయిన వేయొచ్చును
 • ఉప్పుతగినంత
 • మినగపప్పు ఒక చిన్న చెంచా
 • శనగపప్పు ఒక చెంచా
 • జీలకర్ర ఒక సగము చెంచా
 • ఎండు మిరపకాయలు మూడు
 • పచ్చిమిరపకాయలు రెండు
 • ఇంగువ చిటికెడు
 • కరివేపాకు
 • నూనె ఒక మూడు చంచాలు..

గోరుచిక్కుడుకాయ కూర ఎండు కొబ్బరి పొడి వేసి | How to make cluster. Beans with coconut powderurry Recipe in Telugu

 1. ముందుగా గోరుచిక్కుడుకాయలు కడిగి నారలు లేకుండా వాలిచి కూకర్లో వేసి మూడు సీటీలు కొట్టేవారకు ఉంచి తరువాత స్టవ్ ఆర్పేయాలి..
 2. రెండు నిమిషాలు తరువాత స్టీమ్ తగ్గాక ఒక కన్నలున్న చల్ని ప్లేట్ లో తీసి చల్లారే నివ్వాలి
 3. కూర చల్లారాక స్టవ్ మీద మూకుడు పెట్టి అందులో నునే వేసి వేడెక్కిన తరువాత అందుకో పోపు వేసుకోవలెను
 4. పోపులో మినగపప్పు... శనగ పప్పు...జీలకర్ర..ఎండు మిర్చి ...పచ్చిమిరపకాయలు ...కరివేపాకు.... ఇంగువ వేసి వేగనివ్వాలి
 5. పోపు వేగాక అందులో వార్చి ఉంచిన కూర వేసి బాగా కలిపి అప్పుడు అందులో ఉప్పు ..పసుపు వేసి బాగా కలియ పెట్టి మూత పెట్టి ఉంచాలి
 6. ఇప్పుడు అది పోపుతోని ఉప్పు పసుపుతో బాగా ఉడికి ఉన్నంతవరకు నీళ్లు ఇంకిపోతాయి
 7. అంత బాగా పొడిగా అయ్యాక అందులో కొబ్బరి పొడి వేసి కింద మీద బాగా కాలియపెట్టాలి ..
 8. కొబ్బరి పొడి ఏదయినా వేయొచ్చు..ఎండుదయిన..పచ్చిదయిన పర్వాలేదు..
 9. కొబ్బరిపొడి వేశక మూత పెట్టకూడదు.
 10. అంతే గోరుచిక్కుడుకాయ కొబ్బరి కోరు వేసిన కూర తయారు.

నా చిట్కా:

యి కూరలో వీలయినంత వరకు పచ్చి కొబ్బరి తురుము వేస్తే యింకా రుచిగా ఉంటుంది.పచ్చి కొబ్బరి లేక నేను ఎండు కొబ్బరి వేసాను.

Reviews for cluster. Beans with coconut powderurry Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo