వంకాయ బంగాళదుంప... తెల్ల బఠాణీలు...చిక్కుడు గింజలు అన్ని కలిపిన కూరా అసలయిన ఆంధ్రుల వంట ... | Brinjal...alu..white batani and dry barabatti seeds Recipe in Telugu

ద్వారా Shobha.. Vrudhulla  |  22nd Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Brinjal...alu..white batani and dry barabatti seeds recipe in Telugu,వంకాయ బంగాళదుంప... తెల్ల బఠాణీలు...చిక్కుడు గింజలు అన్ని కలిపిన కూరా అసలయిన ఆంధ్రుల వంట ..., Shobha.. Vrudhulla
వంకాయ బంగాళదుంప... తెల్ల బఠాణీలు...చిక్కుడు గింజలు అన్ని కలిపిన కూరా అసలయిన ఆంధ్రుల వంట ...by Shobha.. Vrudhulla
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

వంకాయ బంగాళదుంప... తెల్ల బఠాణీలు...చిక్కుడు గింజలు అన్ని కలిపిన కూరా అసలయిన ఆంధ్రుల వంట ... వంటకం

వంకాయ బంగాళదుంప... తెల్ల బఠాణీలు...చిక్కుడు గింజలు అన్ని కలిపిన కూరా అసలయిన ఆంధ్రుల వంట ... తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Brinjal...alu..white batani and dry barabatti seeds Recipe in Telugu )

 • వంకాయలు లేటగా ఉన్నవి పెద్దవి మూడు
 • బంగాళాదుంపలు పెద్దవి రెండు
 • తెల్ల బఠాణీలు ఎండువి అర కప్పు
 • చిక్కుడు గింజలు ఎండువి అర కప్పు
 • చింతపండు ఒక పిడికెడు...పులుపు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు పులుపు
 • అల్లం పచ్చిమిరపకాయల ముద్ద ఒక చెంచా
 • ఉప్పు తగినంత
 • పసుపు అర చెంచా
 • మేంటిగుండా మూడు నుంచి నాలుగు చెంచాల వరకు ఉంచుకోవాలి..
 • శనగపప్పు ఒక చెంచా
 • మిన్నగ పప్పు ఒక చెంచా
 • ఆవాలు అర చెంచా
 • ఇంగువ ఓ రెండు చిటికెలు..
 • మెంతులు చిటికెడు
 • కరివేపాకు రెబ్బలు రెండు
 • ఎందుమిరపకాయలు మూడు..కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు..

వంకాయ బంగాళదుంప... తెల్ల బఠాణీలు...చిక్కుడు గింజలు అన్ని కలిపిన కూరా అసలయిన ఆంధ్రుల వంట ... | How to make Brinjal...alu..white batani and dry barabatti seeds Recipe in Telugu

 1. తెల్ల బఠాణీలు ఎండు చిక్కుడు గింజలు ఒకరోజు ముందుగా రాత్రి నానపెట్టి ఉంచుకోవలెను..
 2. కూర చేసేటప్పుడు ముందుగా రాత్రి నానపెట్టి ఉంచిన బఠాణీలు కుక్కర్లో వేసి ఐదు విజిల్స్ వచ్చేదాకా ఉంచి తరువాత స్టవ్ బంద్ చేసి దించేయవలెను
 3. ఇప్పుడు వంకాయలు దుంపలు బాగా కడిగి దుంపలకి తొక్క తీసి చక్కగా పెద్ద గా ముక్కలు తరిగి అవి కూడా కుక్కర్లో వేసి రెండు విజిల్స్ వచ్చేదాకా ఉంచి తరువాత దించేయవలెను
 4. ఇప్పుడు చింతపండు కూడా ముందుగా బాగా కడిగి నానపెట్టి ఉంచుకోవలెను తగినన్ని నీళ్లు పోసి..
 5. ఇప్పుడు స్టవ్ మీద ముకుడు పెట్టి బాగా వేడెక్కేక అందులో నూనె ఓ అర కప్పుడు వేయాలి
 6. నూనె వేడెక్కేక అందులో పోపు శనగపప్పు.. మినగపప్పు.. అవాలు... ఇంగువ... మెంతులు... కరివేపాకు.. అన్ని వేసి చక్కగా ఎర్రగా వేగాక అందులో అల్లం పచ్చిమిరపకాయల ముద్ద వేసి మరికాస్త వేగనివ్వాలి..
 7. ఇవి వేగాక అందులో నానపెట్టి ఉంచిన చింతపండు పుల్ల బాగా తీసి ఈ వేగిన పోపులో వేయవలెను..
 8. చింతపండు పుల్ల మరుగుతుండగా అందులో ఉప్పు..పసుపు....మెంతి గుండా వేసి అన్ని బాగా కలపాలి
 9. ఇప్పుడు అన్ని ఉడికించి ఉంచుకున్న కూరలు ఇందులో వేసి బాగా కలిపి మూతపెట్టి రెండు నిమిషా లు వరకు ఉడకనివ్వాలి స్టవ్ తగ్గించి..
 10. రెండు నిమిషాలు ఉడకటం వలన కూరలో వేసినవి అన్ని బాగపట్టి మంచి సువాసున వస్తుంది.
 11. అంతే ఘుమఘుమలాడే వంకాయ ముద్ద కూర తయారు..
 12. సూచన....యి కూరలో కావాలంటే జినుగులు కూడా వేసుకోవచ్చు...జినుగులు వేస్తే యింకా బాగా రుచిగా ఉంటుంది..యింకా చిన్న వడియాలు ఒట్టి మినగపప్పు తో చేసేవి వేసి కూడా చేస్తారు జినుగులతో పాటు..నాదగ్గర జినుగులు ..వడియాలు లేకపోవటం చేయలేకపోయానూ...అంతే..

నా చిట్కా:

ఎందుమిరపకాయలు కావాలంటే వేయొచ్చు లేకపోయినా పర్వాలేదు..నేను వేయలేదు..

Reviews for Brinjal...alu..white batani and dry barabatti seeds Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo