మెంతికూర టమాటో కూర | Methi tomato curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  29th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Methi tomato curry recipe in Telugu,మెంతికూర టమాటో కూర, Sree Vaishnavi
మెంతికూర టమాటో కూరby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

2

0

మెంతికూర టమాటో కూర వంటకం

మెంతికూర టమాటో కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Methi tomato curry Recipe in Telugu )

  • టమాటోలు 5-6
  • మెంతికూర కట్ట 1
  • ఉల్లిపాయ 1-2
  • ఉప్పు తగినంత
  • కారం తగినంత
  • కరివేపాకు 1 రెమ్మ
  • నూనె 3-4 చెంచాలు
  • ఆవాలు 1 చెంచా
  • జీలకర్ర 1 చెంచా
  • ఇంగువ చిటికెడు

మెంతికూర టమాటో కూర | How to make Methi tomato curry Recipe in Telugu

  1. ముందుగా టమాటాలు బాగా కడిగి చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి
  2. మెంతికూర కూడా బాగా కడిగి సన్నగా తరుగుకోవాలి
  3. ఇప్పుడు పొయ్యి మీద ఒక మూకుడు పెట్టి నూనె వేసి తరిగిన మెంతికూర వేసి ఎర్రగా వేయించాలి
  4. అందులో తరిగిన టొమాటోలు వేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి
  5. మగ్గిన తరువాత అందులో ఉప్పు, కారం వేసి వేయించాలి
  6. తరువాత స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి కాచుకోవాలి
  7. అందులో ఆవాలు ,జీలకర్ర ,ఇంగువ కరివేపాకు, వేసి వేయించి టమాటో కూర లో వేసుకోవాలి

Reviews for Methi tomato curry Recipe in Telugu (0)