హోమ్ / వంటకాలు / భోజనం 2

Photo of Everyday lunch 2 by Shobha.. Vrudhulla at BetterButter
417
6
0.0(0)
0

భోజనం 2

Sep-01-2018
Shobha.. Vrudhulla
60 నిమిషాలు
వండినది?
90 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

భోజనం 2 రెసిపీ గురించి

బుట్ట(క్యాబేజీ)కొబ్బరి కూర,టమాటా పప్పు,టమాట పచ్చడి,రోటీ,మరియు అన్నము. తీపి వంటకముగా బెల్లం పరవన్నాము. బెల్లం పరమన్నాము మహాలక్ష్మి ప్రసాదం. తేలికగా తయారు చేసుకునే హాయిగా భుజించ గలిగే తెలుగు వారి భోజనం .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ముందుగా బుట్ట కూరకి :
  2. క్యాబిజీ 1/2 కిలో
  3. కొబ్బరి తురుము 2 కప్పులు
  4. నూనె 3 చంచాలు
  5. శనగ పప్పు 1 చెంచా
  6. మినగపప్పు 1 చెంచా
  7. అవాలు 1/2 చెంచా
  8. పచ్చిమిర్చి/ ఎండు మిరపకాయలు 4 తరిగినవి
  9. కరివేపాకు 2 రెమ్మలు
  10. ఇంగువ చీటికెడు
  11. ఉప్పు తగినంత
  12. పసుపు చిటికెడు
  13. టమాటో పప్పు కి
  14. కందిపప్పు 1 కప్పు (రెండు గంటల నానపెట్టి ఉంచుకోవాలి)
  15. టమాటాలు 2
  16. పసుపు చిటికెడు
  17. ఉప్పు తగినంత
  18. పచ్చిమిర్చి 2
  19. కరివేపాకు రెండు రెమ్మలు
  20. అవాలు 1 చెంచా
  21. జీలకర్ర 1 చెంచా
  22. ఇంగువ చిటికెడు
  23. నెయ్యి 3 చెంచాలు
  24. టమాట పచ్చడి కి
  25. టమాటాలు పెద్దవి ఎర్రగా ఉన్నవి 6
  26. ఉప్పు తగినంత
  27. పసుపు 2 చిటికెలు
  28. ఎండు కారం 3-4 చెంచాలు
  29. ఇంగువ 1/4 చెంచా
  30. మెంతులు 1 చెంచా
  31. చింతపండు నిమ్మకాయంత
  32. నూనె 1 కప్పు
  33. వెల్లుల్లిపాయలు 10-12 రెబ్బలు

సూచనలు

  1. క్యాబేజి కూర తయారీ విధానము , ముందుగా క్యాబేజి కాస్త పెద్ద ముక్కలు గా తరిగి ఉడికించి , వడకట్టి పెట్టుకోవాలి
  2. తరువాత కొబ్బరి తురిమి రెడీగా పెట్టుకోవాలి .
  3. స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె వేసి బాగా వేడెక్కేక శనగపప్పు, మినగపప్పు, అవాలు,ఇంగువ,కరివేపాకు,నిలువుగా తరిగి ఉంచిన పచ్చిమిర్చి వేసి బాగా ఎర్రగా వేగేదాకా ఉంచాలి
  4. పోపు వేగాక అందులో తురిమి ఉంచిన కొబ్బరి కోరు వేసి వేయించాలి రెండు నిమిషాల పాటు.
  5. కోరు వేగాకా అందులో ఉప్పు,పసుపు వేసి కాస్త కలిపి అప్పుడు (క్యాబేజి) బుట్ట కూర వేసుకోవాలి
  6. కూర వేశక రెండు నిమిషాల వరకు కలుపుతూ ఉండాలి.దానివల్ల ఒకవేళ కూరలో నీరు ఉన్న ఇంకిపోయి కూర చక్కగా పొడి పొడిగా వస్తుంది.
  7. కూర మరియు కొబ్బరి కోరు రెండు బాగా కలిసే దాకా కలిపి తీసేయటమే.అంతే క్యాబేజి కూర తయారు.
  8. టమాటా పప్పు విధానము : ముందుగా నానపెట్టి ఉంచిన పప్పుని కూకర్లో వేసి అందులోనే పసుపు రెండు టమాటలు తరిగి వేసి నీళ్లు పోసి మూత పెట్టి ఒక విజిల్ వచ్చేదాకా స్టవ్ పై హైలో పెట్టి ఉడికించండి
  9. ఇప్పుడు ఒక విజిల్ రాగానే స్టవ్ కి పూర్తిగా తగ్గించి ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి .విజిల్లు కూడా వస్తూ ఉంటాయి మధ్యలో పర్వాలేదు
  10. కుక్కర్ అయ్యాక దించి పక్కనపెట్టుకొంటే వేగంగా విశిల్ తగ్గుతుంది.
  11. మూత తీసి పప్పు బాగా లేహ్యంగా ఉడికి ఉంటుంది అయినా మరో సారి గారిటతో బాగా కలియ పెడితే మెత్తగా అయిపోతుంది.
  12. ఒకవేళ మెత్తగా అవకపోతే హాండ్ గ్రైండర్ తో తిప్పెస్తే మెత్తగా అవుతుంది.
  13. ఇప్పుడు స్టవ్ మీద ముకుడు పెట్టి నెయ్య వేసి వేడెక్కక అందులో అవాలు,జీలకర్ర,ఇంగువ,కరివేపాకు,పచ్చి మిర్చి వేసి వేగాక అందులో మెత్తగా చేసి ఉంచిన పప్పు వేసి కలియ పెట్టాలి .
  14. ఉప్పు ,పసుపు కూడా వేసి బాగా కలపాలి.బాగాకలిపి అందులో కాస్త కొత్తిమీర వేసి మరోసారి కలపాలి అంతే.కమ్మగా నేయ్యవేసి అన్నం లో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.ఆంతే పప్పు తయారు .
  15. టమాట పచ్చడి చేసే విధానం : ముందుగా టమాటాలు బాగా కడిగి వాటిని కోరాలి. తరగటం కాకుండా కోరితే వేగంగా అవుతుంది.
  16. కోరిన తరువాత తొక్కలు అన్నిటివి మిగిలి ఉంటాయి కదా అవి పారేయకుండా ఆ తొక్కలు మరియు అందులో కాస్త చింతపండు వేసి మెత్తగా రుబ్బేసుకుంటే అది కూడా ఓ పిడికెడు ముద్ద తయారవుతుంది.
  17. ఇలా రుబ్బిన ముద్దని కోరిన ముద్ద లో వేసి కలుపుకొని, అంతా ఒక దలసరి ముకుడులో వేసి ఉడకటానికి స్టవ్ మీద పెట్టండి.
  18. మూడొంతులు అయ్యాక ఉప్పు , పసుపు వేసుకోవాలి
  19. అది బాగా ఉడికి నీరంతా బాగా ఇంకి పోవాలి. బాగా చక్కగా గట్టిగా అయిపోయే దాకా ఉంచి తరువాత దించేయాలి.
  20. ఇప్పుడు మెంతులు ఎర్రగా వేయించుకోవాలి. కాస్త చల్లార్చుకొని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
  21. వెల్లులి పాయలు కూడా పొత్తు తీసి రెడీ గా ఉంచుకోవాలి . ఇప్పుడు స్టోవేమీద మరొక మూకుడు పెట్టి వేడెక్కిన తరువాత అందులో నూనె వేసి వేడి చేసుకొని వెల్లుల్లి రెబ్బలని వేసి చక్కగా దోరగా వేయించాలి.
  22. అవి వేగాక స్టవ్ కట్టేసి నూనె ముకుడు దించేయాలి.
  23. నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు కారం వేస్తే మాడిపోయి కలర్ మారుతుంది అలా అని మరీ చల్లార్చకూడదు.
  24. ఆ వేడి నూనెలో ఇప్పుడు ఇంగువ మరియు కారము వేసి బాగాకలిపి అప్పుడు అందులో ఉడికిన పచ్చడి వేసి కింద మీద బాగా కలపాలి.
  25. ఇప్పుడు మళ్లీ రెండు నిమిషాలకు మళ్ళీ స్టవ్ మీద పెట్టి సన్నని మంట మీద కలుపుతూ ఉండాలి
  26. ఇప్పుడు ఈ పచ్చడిలో ఒక చెంచా పొడి చేసి ఉంచిన మెంతి పొడి వేసి పచ్చడి అంత బాగా కలిసేలా కలపాలి.
  27. అలా కలుపుతున్నప్పుడే సువాసనలు వస్తాయి.నూనె చాలకపోతే మరికొంచెం నూనె స్టవ్ మీద ఉన్నప్పుడే వేయాలి లేకపోతే కిందకి దించేసి నూనె వేడిచేసి అయిన సరే వేసుకోవాలి.
  28. పచ్చి నూనె వేయకూడదు.కారం ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు .
  29. బాగా ముద్దగా అయిపోయి నూనె వదులుతున్నట్టు అనిపించినప్పుడు స్టవ్ మించి దించేసి చల్లారాక పొడి డబ్బా లో పెట్టుకొనటమే. ఈ పచ్చడి నెల రోజుల పాటు నిలువ ఉంటుంది
  30. వేడి చల్లారకుండా మూత పెడితే మాత్రం మూడు రోజుల్లోనే బూజుపట్టి పాడైపోతుంది .కాబట్టి అది కాస్తా జాగ్రత్తగా చూసుకోండి.
  31. అంతే రుచికరమైన టమాట పచ్చడి తయారు..ఇది అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది.రోటి తో కూడా బాగుంటుంది.
  32. సూచన * కావాలి అనుకునే వాళ్ళు ఇందులో ఆఖరి సారి పచ్చడి దించేక పోపు వేసుకోవచ్చు .ఆవాలు,శనగ పప్పు,కరివేపాకు,ఎండుమిరపకాయలు ఇవి పోపులో వేసుకోవచ్చును .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర