కాకరకాయ వేపుడు | Kaakara kaaya vepudu Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  1st Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Kaakara kaaya vepudu recipe in Telugu,కాకరకాయ వేపుడు, Kavitha Perumareddy
కాకరకాయ వేపుడుby Kavitha Perumareddy
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

1

0

కాకరకాయ వేపుడు వంటకం

కాకరకాయ వేపుడు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kaakara kaaya vepudu Recipe in Telugu )

 • కాకరకాయలు అరకేజీ
 • ఉల్లిపాయ పెద్దది 1
 • నూనె 3 స్పూన్స్
 • పోపుగింజెలు స్పున్
 • కారం చిన్న స్పున్
 • ఉప్పు తగినంత
 • పసుపు కొద్దిగా
 • ధనియాలపొడి 1 స్పున్
 • కరేపాకు కొద్దిగా
 • కొత్తిమీర కొద్దిగా
 • కొబ్బరి వెల్లుల్లి కలిపి చేసిన పొడి 3 స్పూన్స్
 • నిమ్మకాయ 1

కాకరకాయ వేపుడు | How to make Kaakara kaaya vepudu Recipe in Telugu

 1. ముందుగా కాకరకాయ లు శుభ్రంగా కడిగి సన్నగా తరిగి ఉప్పు కలిపిన నీటిలో వేసి 10 నిముషాలు ఉంచాలి
 2. తరువాత కాకరకాయ ముక్కలు నీరు లేకుండా బాగా పిండి ఒక ప్లేట్ లో తీసుకోవాలి.
 3. ఇపుడు పోయిమీద ఒక మందపాటి బాండీ పెట్టి నూనెవేసి వేడి ఐన తరువాత పోపుగింజెలు వేసి వేగిన తరువాత కాకరకాయ ముక్కలు వేసి తగినంత ఉప్పు పసుపును వేసి కలిపి మూతపెట్టి చిన్న మంట మీద మగ్గించుకోవాలి.లేకపోతే మాడిపోతుంది.
 4. సగం మగ్గిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి బాగా మగ్గే వరకు ఉంచాలి.
 5. ఇప్పుడు కూర మగ్గిన తర్వాత కారం, కొబ్బరిపొడి,ధనియాలపొడి ,కరివేపాకు, కొత్తిమీర ,నిమ్మకాయ రసం వేసి అంతా కలిపి 5 నిముషాలు ఉంచాలి.
 6. అంతే ఇంకా వేడివేడిగా కాకరకాయ వేపుడు సిద్ధం.

నా చిట్కా:

ఈ కూరని చిన్న మంట మీద చేసుకుంటే రుచిగా ఉంటుంది. నిమ్మరసం వల్ల చేదు ఉండదు.

Reviews for Kaakara kaaya vepudu Recipe in Telugu (0)