చింతపండు నువ్వుల పొడి పులిహోర | Pulihora Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  5th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Pulihora recipe in Telugu,చింతపండు నువ్వుల పొడి పులిహోర, Sree Vaishnavi
చింతపండు నువ్వుల పొడి పులిహోరby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    16

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

చింతపండు నువ్వుల పొడి పులిహోర వంటకం

చింతపండు నువ్వుల పొడి పులిహోర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Pulihora Recipe in Telugu )

  • చింతపండు పేస్ట్ 3 చెంచాలు
  • నువ్వుల పొడి 3 చెంచాలు
  • ఎండుమిరపకాయలు 3-4
  • అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 చెంచాలు
  • పల్లీలు 3 చెంచాలు
  • ఆవాలు 1 చెంచా
  • జీలకర్ర 1 చెంచా
  • మినపప్పు 1 చెంచా
  • సెనగపప్పు 1 చెంచా
  • ఉడికిన అన్నం 2 కప్పులు
  • కరివేపాకు 1 రెమ్మ
  • ఇంగువ చిటికెడు
  • నూనె 5-6 చెంచాలు
  • ఉప్పు తగినంత
  • పసుపు చిటికెడు

చింతపండు నువ్వుల పొడి పులిహోర | How to make Pulihora Recipe in Telugu

  1. ముందుగా ఉడికిన అన్నం లో పసుపు ,ఉప్పు ,నువ్వుల పొడి ,చింతపండు పేస్ట్ ,నూనె వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి
  2. తరువాత పొయ్యి మీద నూనె పెట్టి అందులో ఆవాలు, మినపప్పు, సెనగపప్పు ,ఎండుమిర్చి ,అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు ,పల్లీలు ,ఇంగువ వేసి వేయించాలి
  3. పోపు వేగిన తరువాత అందులో వేసి బాగా కలిపి సర్వ్ చేయడమే

Reviews for Pulihora Recipe in Telugu (0)