పనీర్ రోటీ రోల్స్ | PANEER WRAP Recipe in Telugu

ద్వారా Sandhya Rani Vutukuri  |  8th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • PANEER WRAP recipe in Telugu,పనీర్ రోటీ రోల్స్, Sandhya Rani Vutukuri
పనీర్ రోటీ రోల్స్by Sandhya Rani Vutukuri
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

పనీర్ రోటీ రోల్స్ వంటకం

పనీర్ రోటీ రోల్స్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make PANEER WRAP Recipe in Telugu )

  • రోటి రోల్ కోసం పిండి
  • గోధుమపిండి 2 కప్పులు
  • మైదా 2 చెంచాలు
  • నూనె 1 చెంచా
  • ఉప్పు చిటికెడు
  • **********************
  • వైట్ సాస్ కోసం(మయో)
  • బట్టర్ 1/2 చెంచా
  • మైదా 1/2 చెంచా
  • పాలు 1 కప్పు
  • ఉప్పు 1/8 చెంచా
  • మిరియాల పొడి 1/4 చెంచా
  • తురిమిన చీజ్ 3 చెంచాలు
  • *******************************
  • గ్రీన్ చట్నీ
  • పుదీనా 1 కట్ట
  • ఉల్లిపాయ 1(చిన్నది)
  • పచ్చి మిర్చి 3
  • ఉప్పు చిటికెడు
  • **************************
  • పనీర్ కూర
  • పనీర్ 200 గ్రాములు
  • ఉల్లిపాయలు 2 (మీడియం)
  • టమాటాలు 2 పెద్దవి(లేదా3)
  • అల్లంవెల్లుల్లి ముద్ద 1 చెంచా
  • గరం మసాలా 1/2 చెంచా
  • ఉప్పు 1 చెంచా
  • ఎర్ర కారం 1 చెంచా
  • టమాట కెచప్ 2 చెంచాలు
  • నీళ్లు 2 కప్పులు

పనీర్ రోటీ రోల్స్ | How to make PANEER WRAP Recipe in Telugu

  1. గోధుమపిండి, మైదా, నూనె,ఉప్పు కలిపి పిండిని రోటి కోసం తయారుగా 20ని.లు నాన నివ్వండి.
  2. ఒకటే శాతం లో మైదా, బట్టర్, 1/2 చెంచా మిరియాల పొడి, చిటికెడు ఉప్పు తీసుకోండి.
  3. మూకుడు పొయ్యి పై పెట్టి బట్టర్ వేసి కారుగుతూ వుండగా అదే శాతంలో మైదా వేసి ఆగకుండా కలపండి.
  4. 3,4 ని.ల దాకా ఆగకుండా కలపాలి.మంచి వాసన వచ్చాక స్టవ్ కట్టేసి పాలు పోసి బాగా కలిపి మళ్లీ పొంగు వొచ్చేదాక వుడక నివ్వండి.
  5. దింపి, ఉప్పు మిరియాల పొడి కలిపితే వైట్ సాస్ రెడీ.
  6. మిక్సీ లో ఒక కట్ట పుదీనా, ఉల్లి,మిర్చి, నిమ్మరసం, ఉప్పు వేసి పేస్ట్ చేసుకోండి.
  7. కూర కోసం ఉల్లిపాయలు, టమాట లు తరిగి పెట్టుకోండి
  8. మూకుడు పొయ్యి పై పెట్టి 2 చెంచాల నూనె వేసి, కాగాక అల్లంవెల్లుల్లి వేసి, ఉల్లి తరుగు వేయాలి.
  9. అవ్వి ఎర్రగా అవ్వగానే, టమాటో ముక్కలు, గరం మసాలా పొడివేసి దగ్గరయ్యే దాకా ఉడికించుకోవాలి
  10. టమాటో కెచప్ వేసి బాగా కలిపి ఉప్పు, కారం వేసి, 2 కప్పుల నీళ్లు పోసి బాగా ఉడికించి పనీర్ ముక్కలు వేసు కోవాలి.
  11. ఇప్పుడు రోటీలు చేసుకొని ముందుగా వైట్ సాస్, గ్రీన్ సాస్ ఇలాగ రాయాలి
  12. ఆ రోటి పైన పనీర్ కూర పెట్టి పూర్తి గా పరిచి, రోల్ చేయాలి.
  13. తరువాత పేపర్ టవల్ తీసుకొని, ఈ రోల్ ఉంచి నీట్ గా డబ్బాలో పెట్టి ఇవ్వండి.

నా చిట్కా:

సన్న మంటపై, ఉల్లి, క్యాప్సికమ్ ముక్కలు దోరగా వేయించి సాస్ లు పెట్టి, ఆపై కూర పెట్టి ఇస్తే రోల్ బావుంటుంది.

Reviews for PANEER WRAP Recipe in Telugu (0)