మామిడికాయ చిత్రాన్నం | Mango chitranna Recipe in Telugu

ద్వారా Revathi Kumari  |  8th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Mango chitranna recipe in Telugu,మామిడికాయ చిత్రాన్నం, Revathi Kumari
మామిడికాయ చిత్రాన్నంby Revathi Kumari
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

మామిడికాయ చిత్రాన్నం వంటకం

మామిడికాయ చిత్రాన్నం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mango chitranna Recipe in Telugu )

  • అన్నం 2 కప్పులు
  • మామిడికాయ 1
  • కరివేపాకు 1 రెమ్మ
  • 2-3 పచ్చిమిర్చి
  • 1-2 ఎండుమిర్చి
  • ఉప్పు తగినంత
  • 1/4 చెంచా పసుపు
  • 3 చెంచాలు పల్లీలు
  • 1 చెంచా సెనగపప్పు
  • 1 చెంచా మినపప్పు
  • 1 చెంచా ఆవాలు
  • 1 అంగుళం అల్లం తరిగినది
  • 3 చెంచాలు నూనె
  • కొబ్బరితురుము 1 చెంచా
  • కొత్తిమీర 1 చెంచా

మామిడికాయ చిత్రాన్నం | How to make Mango chitranna Recipe in Telugu

  1. ముందుగా అన్నం ని పొడిపొడిగా ఉడికించుకోవాలి
  2. మామిడికాయకి తొక్కు తీసి తురుముకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె, పల్లీలు వేసి వేగనివ్వాలి
  4. వేగిన తర్వాత అందులో సెనగపప్పు ,మినపప్పు, ఆవాలు, కరివేపాకు వేగనివ్వాలి
  5. వేగిన తర్వాత అందులో ఎండుమిర్చి ,పచ్చిమిర్చి ,అల్లం కూడా వేసి వేయించాలి
  6. ఇప్పుడు అందులో మామిడి తురుము వేసి కొంచెం వేగాక ఉప్పు, పసుపు వేసి వేయించాలి
  7. దీనిని అన్నం మిశ్రమం లో వేసి బాగా కలుపుకోవాలి
  8. కొంచెం కొబ్బరి తురుము ,కొత్తిమీర వేసి సర్వ్ చేయడమే

Reviews for Mango chitranna Recipe in Telugu (0)