వాంగిబాత్ | VAANGI bath Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  17th Sep 2018  |  
1 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • VAANGI bath recipe in Telugu,వాంగిబాత్, Kavitha Perumareddy
వాంగిబాత్by Kavitha Perumareddy
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  25

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

1

1

వాంగిబాత్ వంటకం

వాంగిబాత్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make VAANGI bath Recipe in Telugu )

 • ఒక పెద్ద కప్ వండిన అన్నం
 • వంకాయలు పావుకేజీ
 • ఉల్లిపాయలు 1
 • పచ్చిమిర్చి 3
 • నూనె 3 స్పూన్స్
 • పోపుగింజెలు 1 స్పున్
 • జీడిపప్పు 10 గ్రామ్స్
 • ఉప్పు తగినంత
 • పసుపు కొద్దిగా
 • కొత్తిమీర గుప్పెడు
 • కరివేపాకు 2 రెమ్మలు
 • వాంగిబాత్ మసాలకు కావాలిసినవి
 • మినప్పప్పు 2 స్పూన్స్
 • సెనగపప్పు 2 స్పూన్స్
 • జీలకర్ర స్పున్
 • ధనియాలు స్పున్
 • దాల్చిన చెక్క అంగుళం ముక్క
 • లవంగాలు 3
 • గసగసాలు స్పున్,ఇది అంత ముఖ్యం కాదు .ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు.
 • కొబ్బరి పావు గిన్నె
 • ఎండుమిర్చి 6
 • మిరియాలు 10

వాంగిబాత్ | How to make VAANGI bath Recipe in Telugu

 1. ముందుగా పోయిమీద బాండీ పెట్టి ముందుగా మినపప్పు,సెనగపప్పు వేసి వేగిన తరువాత మిగిలిన మసాలా దినుసులు వేసుకొని వేగిన తరువాత ఎండుమిర్చి,కొబ్బరి పొడి వేసి వేపుకొని చివరగా గసగసాలు వేసి వేపుకోవాలి.లేకపోతే మాడిపోతాయి.
 2. ఇప్పుడు మలాలా దినుసులు చల్లారిన తరువాత మిక్షిలో వేసి పొడి చేసి పెట్టుకోవాలి.
 3. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి నూనె వేసి వేడిచేసి ,పోపుగింజలు,జీడిపప్పు, వేసి వేగిన తరువాత కరివేపాకు, ఉల్లిపాయలు ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కాసేపు మగ్గించాలి .ఇప్పుడు వంకాయ ముక్కలు, కొద్దిగా పసుపు,తగినంత ఉప్పు , కలిపి చిన్న మంట మీద 5 నిముసాలు మగ్గించుకోవాలి.
 4. వంకాయలు మగ్గిన తరువాత తయారు చేసుకున్న వాంగిబాత్ మసాలా,కొత్తిమీర వేసి బాగా కలిపాలి.
 5. ఇప్పుడు అన్నము వేసి అంత కలిసేలా బాగా కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసి అవసరం ఐతే ఇంకా కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి.
 6. ఇంకా వేడి వేడి వాంగిబాత్ రెడీ .కొత్తిమీరతో అలంకరించుకోవడమే.

నా చిట్కా:

వంకాయ ముక్కలు తరిగిన తరువాత ఉప్పునీటిలో ఉంచాలి .లేకపోతే నల్లగా ఐపోయి చేదు వస్తాయి.

Reviews for VAANGI bath Recipe in Telugu (1)

Lakshmi Leelavathi7 months ago

జవాబు వ్రాయండి

Cooked it ? Share your Photo