సొరకాయ తొక్కు పచ్చడి | Bottle Gourd Chutney Recipe in Telugu

ద్వారా Sudha Badam  |  21st Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Bottle Gourd Chutney recipe in Telugu,సొరకాయ తొక్కు పచ్చడి, Sudha Badam
సొరకాయ తొక్కు పచ్చడిby Sudha Badam
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

5

0

సొరకాయ తొక్కు పచ్చడి వంటకం

సొరకాయ తొక్కు పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bottle Gourd Chutney Recipe in Telugu )

  • సగం సొరకాయ నుండి తీసిన తొక్కు
  • పచ్చిమిర్చి 5
  • చింతపండు చిన్న నిమ్మకాయంత
  • ధనియాలు 2 స్పూన్లు
  • పల్లీలు 2 స్పూన్లు
  • జీలకర్ర 1 స్పూను
  • నూనె 4 స్పూన్లు
  • పోపు దినుసులు- మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు
  • ఉప్పు,పసుపు

సొరకాయ తొక్కు పచ్చడి | How to make Bottle Gourd Chutney Recipe in Telugu

  1. మూకుడులో రెండు స్పూన్లు నూనె వేసి ధనియాలు, పల్లీలు, జీలకర్ర దోరగా వేయించి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి.
  2. అదే పాన్ లో ఒక స్పూన్ నూనె వేసి పచ్చిమిర్చి, సొరకాయ తొక్కు వేసి మగ్గనివ్వాలి.
  3. అవి మగ్గుతుండగా మధ్యలో చింతపండు కూడా విడదీసి వేసి మగ్గనివ్వాలి.
  4. బాగా మగ్గేక చల్లారాక మిక్సీ జార్ లోకి తీసుకుని ఉప్పు, పసుపు వేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి.
  5. పాన్ లో ఒక స్పూన్ నూనె వేసుకుని, తిరగ మూత పెట్టుకుని పచ్చడిలో కలుపుకోవాలి.

నా చిట్కా:

తొక్కులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన పడేయకుండ పచ్చడిలా చేసుకుంటే మంచిది.

Reviews for Bottle Gourd Chutney Recipe in Telugu (0)