కాకరకాయ నిల్వపచ్చడి | Bitter gourd pickel Recipe in Telugu

ద్వారా రమ్య వూటుకూరి  |  30th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Bitter gourd pickel recipe in Telugu,కాకరకాయ నిల్వపచ్చడి, రమ్య వూటుకూరి
కాకరకాయ నిల్వపచ్చడిby రమ్య వూటుకూరి
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

0

0

కాకరకాయ నిల్వపచ్చడి వంటకం

కాకరకాయ నిల్వపచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bitter gourd pickel Recipe in Telugu )

 • కాకరకాయలు 1/4 కెజి
 • కారం 1/2 కప్
 • ఉప్పు తగినంత
 • ఆయిల్ డీప్ ఫ్రై కి తగినంత
 • పల్లి ఆయిల్ 1/2 కప్
 • ఆవాలు 1 టేబుల్ స్పూన్
 • మెంతులు 1టేబుల్ స్పూన్
 • ఎండుమిర్చి 2
 • ఇంగువ చిటికెడు
 • చింతపండు 2 నిమ్మకాయల౦త
 • కరివేపాకు 1 రెమ్మ

కాకరకాయ నిల్వపచ్చడి | How to make Bitter gourd pickel Recipe in Telugu

 1. కాకరకాయలు కడిగి ఆరబెట్టి పెద్దముక్కలుగా కోసుకోవాలి
 2. వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి మరీ క్రిస్పీ గా చేసుకోవద్దు.
 3. పాన్ లో ఆవాలు మెంతులు దొరగా వేయించుకుని పొడి చేసుకోవాలి
 4. చింతపండు వేడి నీళ్లలో నానబెట్టి గుజ్జు తీసుకోవాలి.
 5. చింతపండు గుజ్జు ని 1 స్పూన్ ఆయిల్ లో బాగా ఉడకబెట్టుకొని బాగా దగ్గరకు వచ్చేవరకు ఉంచాలి
 6. ఇప్పుడు కాకరకాయ ముక్కల్లో చింతపండు గుజ్జు ఉప్పు కారం తయారుచేసుకొన్న పొడి వేసి బాగా కలుపుకోవాలి
 7. పల్లి ఆయిల్ లో కొంచం ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ తో పోపు వేసుకొని పచ్చడిలో కలుపుకోవాలి
 8. రుచికరమైన కాకరకాయ ఫికెల్ రెడి అన్నం లోకి బాగుంటుంది

Reviews for Bitter gourd pickel Recipe in Telugu (0)