కొబ్బరి వాక్కాయ పచ్చడి | Coconut and Cranberry chutney Recipe in Telugu

ద్వారా Sri Tallapragada Sri Devi  |  9th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Coconut and Cranberry chutney recipe in Telugu,కొబ్బరి వాక్కాయ పచ్చడి, Sri Tallapragada Sri Devi
కొబ్బరి వాక్కాయ పచ్చడిby Sri Tallapragada Sri Devi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

About Coconut and Cranberry chutney Recipe in Telugu

కొబ్బరి వాక్కాయ పచ్చడి వంటకం

కొబ్బరి వాక్కాయ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Coconut and Cranberry chutney Recipe in Telugu )

  • లేత ముదురు కాని కొబ్బరి చెక్కలు 2
  • వాక్కాయలు 100 గ్రాములు
  • పచ్చిమిరప 4
  • నూనె రెండు టేబుల్ స్పూన్లు
  • ఎండు మిరప 6
  • మెంతులు అర స్పూను
  • ఆవాలు ఒక స్పూను
  • మినప్పప్పు రెండు స్పూన్లు
  • ఇంగువ రెండు చిటికెలు
  • పసుపు చిటికెడు
  • ఉప్పు తగినంత
  • ఈ కాయలు పుల్లగా ఉండడాన్ని బట్టి మీ కారాన్ని బట్టి మిరపకాయలు వేసుకోవాలి

కొబ్బరి వాక్కాయ పచ్చడి | How to make Coconut and Cranberry chutney Recipe in Telugu

  1. వాక్కాయలు శుభ్రంగా కడిగి ముక్కలు చేసి వాటిలో ఉండే గింజల్ని తీసేయాలి
  2. కొబ్బరిని కూడా చిప్ప నుంచి వేరు చేసి సన్నగా తరిగి ఉంచుకోవాలి
  3. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి నూనె వేసి ఎండుమిర్చి మెంతులు మినప్పప్పు ఆవాలు ఎర్రగా వేగాక ఆఖరిన ఇంగువ పసుపు వేసుకోవాలి
  4. కొబ్బరి ముక్కలు వాక్కాయ ముక్కలు ఎండుమిర్చి పోపు పచ్చిమిర్చి ఉప్పు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
  5. కొద్దిగా కరివేపాకు మినప్పప్పు ఆవాలు జీలకర్ర పై పోపు వేసుకుంటే బాగుంటుంది

నా చిట్కా:

అన్నంలో నువ్వుల నూనె తో కలుపుకొని కారం ఇష్టపడేవారు లేత పచ్చిమిరపకాయలు నంచుకు తింటే చాలా బాగుంటుంది

Reviews for Coconut and Cranberry chutney Recipe in Telugu (0)