హోమ్ / వంటకాలు / మెంతి కూర టమాటా రోటీ పచ్చడి

Photo of Methi Tomato chutney by Sadhhna praveen at BetterButter
997
2
0.0(0)
0

మెంతి కూర టమాటా రోటీ పచ్చడి

Oct-10-2018
Sadhhna praveen
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మెంతి కూర టమాటా రోటీ పచ్చడి రెసిపీ గురించి

ఈ పచ్చడి అన్నము లోకి చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • తెలంగాణ
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 5

  1. మెంతి కూర 4 కట్టలు
  2. టమాటాలు 4
  3. పచ్చి మిరపకాయలు 10
  4. ఎండు మిరపకాయలు 3
  5. ఆవాలు జీలకర్ర ఒక టీ స్పూన్
  6. మినపప్పు ఒక టీ స్పూన్
  7. నువ్వుల పొడి రెండు టీ స్పూన్
  8. ఉప్పు తగినంత
  9. పసుపు చిటికెడు
  10. నూనె 3 టేబుల్ స్పూన్
  11. వెల్లుల్లి రెబ్బలు 4
  12. కరివేపాకు ఒక రెమ్మ

సూచనలు

  1. ముందుగుగా మెంతి కూర కట్టలని సన్నగా కట్ చేసి కడిగి పక్కన పెట్టుకోవాలి
  2. టమాటో కూడా ముక్కలు గా కట్ చేసుకోవాలి
  3. ఇప్పుడు ఒక కడాయి పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి
  4. నూనె వేడి ఎక్కగానే మెంతి కూర వేసి బాగా వేయించుకోవాలి
  5. ఇప్పుడు పచ్చి మిరపకాయలు వేసి వేయించుకోవాలి
  6. మెంతి కూర వేగాక టమాటో ముక్కల్ని వేసి కొంచెము ఉప్పు చిటికెడు పసుపు వేసి వేయించుకోవాలి
  7. 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇప్పుడు
  8. అంత వేగాక 2 స్పూన్ల నువ్వుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  9. ఆ మిశ్రమము చల్లారాక మిక్సీ లో గ్రైండ్ చేసుకోవాలి
  10. ఇప్పుడు చిన్న పాన్ పెట్టి ఒక స్పూన్ నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు,ఎందు మిరపకాయలు కరివేపాకు, వేసి పోపు వేసుకోవాలి
  11. ఈ పోపుని గ్రైండ్ చేసిన మెంతి కూర టమాటో పేస్ట్ లో బాగా కలుపుకోవాలి
  12. అంతే ఎంతో రుచికరమైన మెంతి కూర టమాటో రోటీ పచ్చడి రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర