హోమ్ / వంటకాలు / పాల కూర బంగాళ దుంప కూర

Photo of Alu paalak masala curry by Shobha.. Vrudhulla at BetterButter
445
1
0.0(0)
0

పాల కూర బంగాళ దుంప కూర

Oct-12-2018
Shobha.. Vrudhulla
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాల కూర బంగాళ దుంప కూర రెసిపీ గురించి

పాల కూర ఎన్నో రకాలుగా ఒంటికి మంచిది...యి కూరలో బాగా ఐరన్ కూడా ఉంటుంది...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఉత్తర భారతీయ
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పాల కూర అర కిలో
  2. దుంపలు రెండు
  3. టమాటాలు మూడు
  4. ఉల్లిపాయలు రెండు
  5. అల్లంవెల్లుల్లి ముద్ద ఒక చెంచా
  6. ఉప్పు తగినంత
  7. పసుపు కొంచెము
  8. కారము నాలుగు చంచాలు
  9. ధనియాల పొడి రెండు చంచాలు
  10. జీలకర్ర పొడి ఒక చెంచా
  11. గరం మసాలా పొడి ఒక చెంచా
  12. నూనె మూడు చంచాలు
  13. జీలకర్ర ఒక అర చెంచా
  14. పచ్చిమిరపకాయ ఒకటి

సూచనలు

  1. ముందుగా పాల కురని ఇసుక లేకుండా బాగా కడిగి తరిగి పెట్టుకోవలెను
  2. దుంపలు తొక్కలు తీసి కడిగి తరిగి నీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకోవలెను
  3. టమాటాలు కూడా కడిగి గ్రైండ్ చేసి ఉంచుకోవలెను
  4. ఇప్పుడు పాలకూర ని ఒక గిన్నీలో వేసి జీలకర్ర పచ్చిమిర్చి కూడా వేసి ఒక పావు గ్లాస్ నీళ్లు పోసి ఒక్క మూడు నిమిషాల ఉడికించవలెను మూత పెట్టి.
  5. ఎక్కువగా ఉడికిస్తే పాలకురలో ఉన్న బలం పోతుంది .
  6. ఇప్పుడు ఒక ముకుడు తీసుకొని స్టవ్ మీద పెట్టి నూనె వేయవలెను.
  7. నూనె వేడెక్కిన తరువాత అందులో ఉల్లిపాయలు వేసి బ్రౌన్ రంగు వచ్చేవరకు వేయించాలి.
  8. ఉల్లిపాయలు వేగాక అందులో అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మంచి సువాసన వచ్చేదాకా వేయించవలెను.
  9. అల్లం వెల్లుల్లి ముద్ద వేగాక అందులో పల్చగా తరిగి ఉంచిన దుంప ముక్కలు వేయాలి.
  10. దుంప ముక్కలు వేసాక రెండు నిమిషాలు మూత పెట్టి వేయించాలి.
  11. ముందుగా పాలకూర ఉడికించి ఉంచుకుంటున్నాము కాబట్టి దుంపలుకుడా కాస్త వేగి మెత్తపడితే పాలకూర వేశక ఎక్కువగా ఉడికించ నవసరంలేదు
  12. దుంపలు మెత్తపడిన తరువాత అందులో రుబ్బి ఉంచిన టమాట ముద్ద ని వేసి బాగా వేయించాలి దగ్గర పడేదాక.
  13. టమాట ముద్ద వేగాక అందులో వరుసగా ఉప్పు,పసుపు,కారము,ధనియాల పొడి,జీలకర్ర పొడి ,.గరం మసాలా పొడి వేసి బాగా కాలియపెట్టాలి
  14. ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసి మరోసారి బాగా కలప వలెను
  15. పాల కూరలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు కాస్త తగ్గించి వేసుకుంటే మంచిది
  16. ఇప్పుడు అన్ని వేసి బాగా కలిపాక అందులో ఉడికించి ఉంచిన పాల కూర వేసి కింద మీద బాగా కలిపి మరో రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి.
  17. ఇలా ఆఖరిలో ఉడికించటం వలన ఉప్పు మసాలా పొడులు అన్నీ కూరలో కలుస్తాయి .
  18. మంచి రుచి తో పాటు రంగు కూడా వస్తుంది.
  19. ఆఖరికి మొత్తం నీళ్లు ఇనికి పోకుండా కాస్త రసం ఉండేలా చూసి స్టవ్ ఆపి దించేయవలెను.
  20. అంతే ఎంతో రుచికరమయిన, ఆరోగ్యమయిన కూర తయారు.
  21. యి కూర వేడి వేడిగా అన్నాముతో కానీ రొట్టెలతో కానీ తింటే చాలా బాగుంటుంది...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర