తోటకూర పప్పుకూర | Amaranthus dal Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  14th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Amaranthus dal recipe in Telugu,తోటకూర పప్పుకూర, Pravallika Srinivas
తోటకూర పప్పుకూరby Pravallika Srinivas
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

తోటకూర పప్పుకూర వంటకం

తోటకూర పప్పుకూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Amaranthus dal Recipe in Telugu )

  • తోటకూర - అరకట్ట
  • కందిపప్పు - 1 t glass
  • టమాటో - 2
  • నీరు - తగినంత
  • చింతపండు - 4 రెబ్బలు
  • ఉల్లిపాయలు - 1
  • ఉప్పు - తగినంత
  • కారం - 1 spn
  • నూనె - 3 tbsp
  • పోపు దినుసులు - 1 tbsp
  • వెల్లులిరెబ్బలు - 10
  • కర్వేపాకు - 2 రెమ్మ
  • పసుపు - 1/4 spn
  • ఇంగువ - 1/4 spn
  • యండుమిర్చి - 2

తోటకూర పప్పుకూర | How to make Amaranthus dal Recipe in Telugu

  1. ముందుగా కందిపప్పును కడిగి పెట్టి నానపెట్టాలి.
  2. ఈలోగా తోటకూర కాడలు పీచుతీసి గిల్లుకుని తరిగి కడిగి పెట్టుకోవాలి.
  3. ఒక కుక్కర్ లో కందిపప్పు ,టమాటో, ఉల్లిపాయలు, చింతపండు ,నీరు వేసి 5 విసిల్స్ వచ్చేవరకు ఉంది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  4. ఆవిరైపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి పప్పు గుత్తితో మెదుపుకోవాలి .
  5. స్టవ్ వెలిగించి ఉప్పు ,కారం వేసి మరి కొంచం దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి.
  6. కడై పెట్టి నూనె వేసి కాగాక పోపు దినుసులు ,వెల్లులిరెబ్బలు ,కర్వేపాకు,యండుమిర్చి, పసుపు ,ఇంగువ వేసి చిటపటలాడాక తయారైన పప్పు లో వేసుకోవాలి .
  7. అంతే రుచికరమైన తోటకూర పప్పుకూర రెడీ ..

నా చిట్కా:

తోటకూర కాడలుతో సహా వేసుకుంటే బాగుంటుంది. అందువలన ఫైబర్ బాగా అందుతుంది

Reviews for Amaranthus dal Recipe in Telugu (0)