కొత్తిమీర కాకరకాయ పెసర బరడ | Coriander, bitter gourd greendal fry Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  16th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Coriander, bitter gourd greendal fry recipe in Telugu,కొత్తిమీర కాకరకాయ పెసర బరడ, Pravallika Srinivas
కొత్తిమీర కాకరకాయ పెసర బరడby Pravallika Srinivas
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

కొత్తిమీర కాకరకాయ పెసర బరడ వంటకం

కొత్తిమీర కాకరకాయ పెసర బరడ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Coriander, bitter gourd greendal fry Recipe in Telugu )

 • కొత్తిమీర - 1 చిన్న కట్ట
 • కాకరకాయ- 250 gms
 • పెసలు - 1 కప్పు
 • పచ్చిమిర్చి -4
 • అల్లం - 1 అంగుళం
 • ఉప్పు - తగినంత
 • నూనె - తగినంత
 • ఆవాలు - 1/2 tbsp
 • జీలకర - 1/2 tbsp
 • చాట్ మసాలా - 1/2 tbsp
 • వెల్లులికారం - 1/2 tbsp
 • నిమ్మరసం - 1 చక్క

కొత్తిమీర కాకరకాయ పెసర బరడ | How to make Coriander, bitter gourd greendal fry Recipe in Telugu

 1. ముందుగా పెసలు నానపెట్టుకోవాలి.
 2. ఇప్పడు కాకరకాయలు కడిగి మధ్యకు కట్ చేసి పొడుగు స్ట్రిప్స్ లాగ కట్ చేసుకోవాలి. కడాయి పెట్టి 2tbsp నూనె వేసి కాగాక కాకరకాయ స్ట్రిప్స్ వేసి లైట్ బ్రౌన్ గా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.
 3. మిక్సర్ జార్ లో నానపెట్టిన పెసలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ,అల్లం, ఉప్పు వేసి రుబ్బుకోవాలి.
 4. ఈ పేస్ట్ ని పెసరపచ్చడిలా తినచ్చు.
 5. ఇప్పుడు ముందుగా వేయించిన కాకరకాయ నూనె లో నే మరొక 2tbsp నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాకా వేయించిన కాకరకాయ స్ట్రిప్స్ ని పెసరపచ్చడి లో ముంచి పోపు పైన వరుసగా పరుచుకోవాలి.
 6. ఇలా అన్నివైపులా కాలేటట్టు చేసుకోవాలి. మొత్తం వేగాక విడివిడిగా వచ్చేస్తాయి.
 7. పైనుండి చాట్ మసాలా, వెల్లులికారం చల్లి నిమ్మరసం పిండుకోవాలి. అంతే ఆరోగ్యమైన కొత్తిమీర కాకరకాయ పెసర బరడ రెడీ ..

నా చిట్కా:

కాకరకాయ చిక్కు తీసుకోకూడదు. దాని వలన పెసర పిండి లో ముంచినపుడు బాగా పట్టుకుంటుంది.

Reviews for Coriander, bitter gourd greendal fry Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo