హోమ్ / వంటకాలు / కొత్తిమీర కాకరకాయ పెసర బరడ

Photo of Coriander, bitter gourd greendal fry by Pravallika Srinivas at BetterButter
107
3
0.0(0)
0

కొత్తిమీర కాకరకాయ పెసర బరడ

Oct-16-2018
Pravallika Srinivas
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొత్తిమీర కాకరకాయ పెసర బరడ రెసిపీ గురించి

కొత్తిమీర హైబీపీని కంట్రోల్ లో ఉంచుతుంది . రక్తహీనతను నివారించడంలో కూడా కొత్తిమీర మంచి పాత్ర పోషిస్తుంది. దీనిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అది హిమోగ్లోబిన్ ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది.చక్కర వ్యాధి ఉన్నవాళ్లు కాకరకాయ తినడం వలన చక్కర కంట్రోల్ లో ఉంటుంది. సాధారంగా బరడ శనగపిండితో చేస్తారు. కానీ నేను పెసర్లు రుబ్బు తో చేశాను. దీనివలన గ్యాస్ట్రబుల్ ఉన్నవాళ్లు కూడా తినవచ్చు.ఈ వంటలో చక్కర వ్యాధి తగ్గేందుకు కాకరకాయ కొత్తిమీర వలన రక్తం శుద్ధి అవుతుంది మరియు పేసర్ల వలన చలవ చేస్తుంది.ఇది ఆరోగ్యపరంగా మంచి రెసిపీ.

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • మీడియం/మధ్యస్థ
 • ప్రతి రోజు
 • భారతీయ
 • తక్కువ నూనెలో వేయించటం
 • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
 • మితముగా వేయించుట
 • సైడ్ డిషెస్
 • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 4

 1. కొత్తిమీర - 1 చిన్న కట్ట
 2. కాకరకాయ- 250 gms
 3. పెసలు - 1 కప్పు
 4. పచ్చిమిర్చి -4
 5. అల్లం - 1 అంగుళం
 6. ఉప్పు - తగినంత
 7. నూనె - తగినంత
 8. ఆవాలు - 1/2 tbsp
 9. జీలకర - 1/2 tbsp
 10. చాట్ మసాలా - 1/2 tbsp
 11. వెల్లులికారం - 1/2 tbsp
 12. నిమ్మరసం - 1 చక్క

సూచనలు

 1. ముందుగా పెసలు నానపెట్టుకోవాలి.
 2. ఇప్పడు కాకరకాయలు కడిగి మధ్యకు కట్ చేసి పొడుగు స్ట్రిప్స్ లాగ కట్ చేసుకోవాలి. కడాయి పెట్టి 2tbsp నూనె వేసి కాగాక కాకరకాయ స్ట్రిప్స్ వేసి లైట్ బ్రౌన్ గా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.
 3. మిక్సర్ జార్ లో నానపెట్టిన పెసలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ,అల్లం, ఉప్పు వేసి రుబ్బుకోవాలి.
 4. ఈ పేస్ట్ ని పెసరపచ్చడిలా తినచ్చు.
 5. ఇప్పుడు ముందుగా వేయించిన కాకరకాయ నూనె లో నే మరొక 2tbsp నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాకా వేయించిన కాకరకాయ స్ట్రిప్స్ ని పెసరపచ్చడి లో ముంచి పోపు పైన వరుసగా పరుచుకోవాలి.
 6. ఇలా అన్నివైపులా కాలేటట్టు చేసుకోవాలి. మొత్తం వేగాక విడివిడిగా వచ్చేస్తాయి.
 7. పైనుండి చాట్ మసాలా, వెల్లులికారం చల్లి నిమ్మరసం పిండుకోవాలి. అంతే ఆరోగ్యమైన కొత్తిమీర కాకరకాయ పెసర బరడ రెడీ ..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర