హోమ్ / వంటకాలు / చుక్కకూర పప్పు

Photo of SORREL LEAVES DAL by రమ్య వూటుకూరి at BetterButter
342
1
0.0(0)
0

చుక్కకూర పప్పు

Oct-26-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చుక్కకూర పప్పు రెసిపీ గురించి

చుక్కకూర పుల్లగా ఉంటుంది. దీనితో చేసే పప్పు చాలా రుచికరంగా ఉంటుంది . అన్నం చపాతీ లోకి బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. చుక్కకూర 2 కట్టలు
  2. కందిపప్పు 1 కప్
  3. వెల్లుల్లి 5 రెబ్బలు
  4. కరివేపాకు 1 రెమ్మ
  5. ఎండుమిర్చి 2
  6. పచ్చిమిర్చి 2
  7. కారం 1 స్పూన్
  8. ఉప్పు తగినంత
  9. ఆయిల్ 1 స్పూన్
  10. పసుపు చిటికెడు
  11. ఇంగువ చిటికెడు
  12. పోపుగింజలు 1 స్పూన్

సూచనలు

  1. కందిపప్పు కడిగి 2 కప్స్ వాటర్ పోసి 3 విజిల్స్ వచ్చేవరకు కుక్కర్లో ఉడికించాలి
  2. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టి వేడెక్కాక ఆయిల్ వేయాలి
  3. ఆయిల్ వేడెక్కాక పోపుగింజలు ఎండుమిర్చి ఇంగువ వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు పచ్చిమిర్చివేసి పోపు వేసుకోవాలి
  4. తర్వాత పోపులో కొంచం వాటర్ పోసి చుక్కకూర పసుపు ఉప్పు వేసి మూతపెట్టి ఉడికించాలి
  5. చుక్కకూర బాగా ఉడికాక ఉడికించుకొన్న కందిపప్పు కారం వేసి బాగా కలిపి 3 మినిట్స్ ఉంచాలి
  6. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర