హోమ్ / వంటకాలు / తోటకూర సొరకాయ రాగి అప్పాలు

Photo of Amaranthus Bottle gourd raagi cutlets by Pravallika Srinivas at BetterButter
420
1
0.0(0)
0

తోటకూర సొరకాయ రాగి అప్పాలు

Oct-30-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తోటకూర సొరకాయ రాగి అప్పాలు రెసిపీ గురించి

మాములుగా అప్పాలు మనం ఎక్కువ బియ్యం పిండి తో చేసుకుంటాం. అప్పుడప్పుడు మనం తృణధాన్యాలను మన ఆహారంలో చేర్చుకోవాలి. అందులో రాగులు చలవ చేస్తాయి. జావా తాగడం ద్వారా ఎక్కువ తీసుకోలేము కాబ్బట్టి ఇలా అప్పాలు అందులో తోటకూర నీటిశాతం ఎక్కువ ఉన్న సొరకాయ కూడా ఇందులో ఉపయోగించడం వలన చాలా ఆరోగ్యమైన అల్పాహారం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చిన్న మంట పై ఉడికించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. తోటకూర - 1 కప్పు
  2. రాగి పిండి - 1 కప్పు
  3. సొరకాయ - సగం ముక్క
  4. ఉల్లితరుగు - 1
  5. ఉప్పు - 1 స్పూన్
  6. కారము - 1 స్పూన్
  7. నానపెట్టిన పెసరపప్పు - 2 పెద్ద చెంచాలు
  8. నూనె - తగినంత

సూచనలు

  1. ముందుగా తోటకూర వలిచి కడిగి తరిగి పెట్టుకోవాలి.
  2. సొరకాయను కడిగి తొక్కు తీసి తురుము కోవాలి. ఉల్లిపాయలు సన్నగా తరిగిపెట్టుకోవాలి.
  3. ఇప్పుడు ఒక బేసన్ లో రాగి పిండి , తురిమిన సొరకాయ , ఉల్లితరుగు, తోటకూర తరుగు ,ఉప్పు, కారము, నానపెట్టిన పెసరపప్పు వేసి కలుపుకోవాలి.
  4. సొరకాయలోని నీరు పిండి తడుపుకోవడానికి సరిపోయి ముద్దగా తయారవుతుంది.
  5. ఇప్పుడు ఈ పిండిని చిన్న ఉండలు చేసి అప్పులు చేసి కాలాయి కి అంటించి నూనె వేసి రెండువైపులా కాల్చుకోవాలి.
  6. అంతే రుచికరమైన తోటకూర సొరకాయ రాగి అప్పాలు రెడీ..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర