BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పుట్టగొడుగులు బచ్చలియాకు కూర.(కీటో డైట్ వారి స్టైల్)

Photo of Mushroom with Malabar spinach(keto diet ) by Swapna Sashikanth Tirumamidi at BetterButter
2
2
0(0)
0

పుట్టగొడుగులు బచ్చలియాకు కూర.(కీటో డైట్ వారి స్టైల్)

Oct-31-2018
Swapna Sashikanth Tirumamidi
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుట్టగొడుగులు బచ్చలియాకు కూర.(కీటో డైట్ వారి స్టైల్) రెసిపీ గురించి

బచ్చలి లో ఐరన్, కాల్షియం,విటమిన్ ఎ,అన్నీ పుష్కలంగా ఉన్నాయి.ఇక పుట్టగొడుగులు సంగతి వేరే చెప్పక్కర్లేదు ఎన్నో మంచి గుణాలున్నాయి ఇందులో.ఇది కీటో డైట్ వారు తినే పద్దతిలో వండాను.చాలా కొత్త కాంబినేషన్.అద్భుతంగా వుంది రుచి.చేసి చూసాక మీరే అంటారు ఆమాట. ఈ కాంబినేషన్ ఇంతకు ముందు ఎక్కడ వినలేదు నేను.కానీ ఇలా చేద్దామనిపించింది నిజంగానే చాలా బాగా ఔట్పుట్ వచ్చింది.

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. మష్రూమ్స్/పుట్టగొడుగులు 150 గ్రామ్స్
  2. బచ్చలి ఆకులు (హద్దులేదు మనయిష్టం)
  3. వెల్లుల్లి రెబ్బలు 8
  4. అల్లం ముక్కలు 1 చెంచా
  5. నూపొడి(నూపప్పు ఎండుమిర్చి వేయించి కొట్టినపొడి)5 చెంచాలు
  6. వెన్న 30 గ్రాములు
  7. పసుపు చిటికెడు
  8. రాళ్లఉప్పు పొడి రుచికి తగినంత.
  9. జీలకర్ర పొడి పావు చెంచా
  10. ధనియాల పొడి పావుచెంచా
  11. కారం ఒక చెంచా
  12. పచ్చి మిర్చి ఒకటి...రెండు

సూచనలు

  1. బచ్చలి ఆకులు శుభ్రంచేసి సన్నగా తరిగి పెట్టుకోవాలి.
  2. మష్రూమ్స్ కూడా ముక్కలు చేసి పెట్టుకోవాలి.
  3. మూకుడులో వెన్న సగం వేసి కాగాక ... కొద్దిగా అల్లం ముక్కలు..రెండు వెల్లుల్లి దంచి వేసి..పచ్చి మిర్చి చీలికలు వేసి అవి వేగాక మష్రూమ్ ముక్కలు వేసి కొద్దిగా పసుపు, ఉప్పు వేసి 10 నిమిషాలు వేయించి పక్కకు తీసిపెట్టుకోవాలి...అందులో ఉన్న నీటితో సహా.
  4. ఇప్పుడు అదే మూకుడులో మిగిలిన వెన్న వేసి కాగాక ...అల్లం ముక్కలు ,వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించి....జీరాపొడి... దనియాల పొడి ..కారం...వేసి 2 నిమిషాలు వేయించాలి.
  5. అందులో తరిగిన బచ్చలి కూర వేసి పసుపు ఉప్పు వేసి బాగా పచ్చివాసన పోయేదాక వేయించాలి.
  6. బచ్చలి బాగా వేగాక వేయించి పెట్టిన మష్రూమ్ ముక్కలు వేసి కలిపి మూటపెట్టి నీరు ఇగిరిపోయేదాకా మగ్గించాలి.
  7. చివరగా నూపొడి వేసి బాగా కలిపి దించుకోవాలి.అంతే ఎంతో రుచికరమైన మష్రూమ్స్ బచ్చలి కూర రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర