హోమ్ / వంటకాలు / మలై మసాలా బెండకాయ కూర

Photo of Cream masala bhendi (littilfingers) by Shobha.. Vrudhulla at BetterButter
612
3
0.0(0)
0

మలై మసాలా బెండకాయ కూర

Dec-10-2018
Shobha.. Vrudhulla
60 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మలై మసాలా బెండకాయ కూర రెసిపీ గురించి

యిది పంజాబీ వంట..మైనవంటకం.చాలా రుచిగా ఉంటుంది మరియు స్పైసి కూడాను.యి కూర రొట్టెలతో కానీ అన్నాముతో కానీ తినొచ్చు ను.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • రాత్రి విందు
  • పంజాబీ
  • వేయించేవి
  • ప్రధాన వంటకం
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

  1. బెండకాయలు 3 పావు
  2. ఆలూ చిన్నవి 3
  3. ఉల్లిపాయలు 3
  4. టమాటాలు 4
  5. ఉప్పు కావలసినంత
  6. పసుపు 1/4 చెంచా
  7. కారము 4 చంచాలు
  8. దనియా పొడి 2 చంచాలు
  9. జీరా పొడి 1 చెంచా
  10. గరం మసాలా పొడి 1 చెంచా
  11. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 పెద్ద చెంచా
  12. పచ్చి మిర్చి 3
  13. నీళ్లు 1 గ్లాస్
  14. నూనె కురాకి మరియు డీప్ ఫ్రై కోసం
  15. మీగడ 4 చంచాలు (చిలికి పెట్టుకోవాలి )
  16. మసాలా పొడి :
  17. సోంపు 2 చంచాలు
  18. జీలకర్ర 1 చంచ
  19. దనియా 1 చెంచా
  20. యాలుకలు 5
  21. దాల్చిన చెక్క 1 ఇంచ్
  22. లవంగాలు 4
  23. కొత్తిమీర ఒక కప్పుడు

సూచనలు

  1. కూర మొదలు పెట్టె ముందు కావాల్సిన మసాలా పొడి తయారు చేసుకుందాము అందుకని పైన చెప్పిన మసాలా దినుసులను నూనె లేకుండా దోరగా మంచి వాసన వచ్చే వరకు వేయించుకొని , చల్లార్చి పొడి చేసి పెట్టుకోండి
  2. ముందుగా బెండకాయల్ని బాగా కడిగి తుడిచి పెట్టుకోవాలి ఆరిన తరువాత వాటికి ముడికలు తీసేసి నిలువుగా కట్ చేసుకోవాలి
  3. ఆ తరువాత ఆలూ కూడా నిలువుగానే కట్ చేసి పెట్టుకోవలెను పైన పిక్ లో చూపించినట్టుగా రెడీ చేసుకోవాలి
  4. తరువాత ఉల్లిపాయలు, టమాటాలు కూడా బాగా సన్నగా కట్ చేసి ఉంచుకోవలెను.
  5. ఇప్పుడు స్టవ్ మీద ముకుడు పెట్టి నూనె డీప్ ఫ్రై కోసం వేసుకోవాలి
  6. నూనె వేడయ్యాక అందులో బెండకాయలు వేసి బాగా వేయించాలి కానీ క్రిస్పీ అవకుండా చూసుకోవాలి
  7. నిలువుగా కట్ చేసుకుంబ ఆలూ కూడా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. అన్నీ వేగాక తీసి పక్కన పెట్టుకోవలెను
  8. ఇప్పుడు స్టవ్ మీద మరో మూకుడు పెట్టి దానిలో 3 చంచాలు నూనె వేసి వేడెక్కనివ్వాలి
  9. నూనె కాగాక అందులో జీలకర్ర వేసి వేగాక అందులో ఉల్లిపాయలు వేయాలి
  10. ఉల్లిపాయలు వేగాక అప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద మరియు 3 పచ్చి మిర్చి నిలువుగా కట్ చేసి వేసుకోవాలి
  11. ఇవన్నీ వేగాక ఇప్పుడు ఇందులో టమాట ముద్దని వేసుకోవాలి .
  12. అది కూడా బాగా వేగి అంత దగ్గర పడ్డాక అందులో ఉప్పు,పసుపు,కారము,దనియా పొడి,జీరా పొడి,గరం మసాలా పొడి వేసి వేగనివ్వాలి 1 నిమిషం వేగనివ్వాలి
  13. అన్నీ వేగాక కొద్దీ కొద్దిగా నూనె పైకి తేలుతుంది
  14. అప్పుడు వేయించిన ఆ పేస్ట్ లో ముందుగా వేయించి తీసి పెట్టిన ఆలూ బెండకాయ ముక్కల్ని ఈ ముకుడులో వేసుకోవాలి
  15. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపి 2 నిమిషాలు ఉంచి ఒక గ్లాస్ నీళ్లు పోసుకోవాలి
  16. ఆ తరువాత అది ఉడికి మసాలా అంత కురాకి పట్టి దగ్గరగా అవుతుంది
  17. అప్పుడు అందులో ముందుగా వేయించి ఉంచిన మసాలా పొడి ఒక చెంచా వేసి బాగా కలపాలి కూర ముద్ద కాకుండా జాగ్రత్తగా
  18. 2 నిమిషాలు తరువాత అప్పుడు కూరలో మలై వేసుకొని కలుపుకోవాలి
  19. మీగడ వేశక చక్కగా కలిసేలా కూరంతా కలిపి 2 నిమిషాలు ఉంచి కొత్తిమీర వేసి కలిపి కిందకు దించేయాలి
  20. కురాకి ఒక బౌల్ లో తీసి అప్పుడు మళ్ళీ కాస్త మీగడ య క్రీమ్ చుట్టూ లేక మధ్యలో వేసి ఒక ప్యాకేజ్ కొత్తిమీర వేసుకో వకేను
  21. అంటే ఏంటో రుచికరమయిన మలై మసాలా భేన్డీ కూర తయ్యార్
  22. యి కూర ఎక్కువగా రొట్టెలు నాన్ కూల్చ ఇలాంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర