హోమ్ / వంటకాలు / కుంగ్ పావ్ పొటాటోస్

Photo of Kung pav potatoes by Pasumarthi Poojitha at BetterButter
184
6
0.0(0)
0

కుంగ్ పావ్ పొటాటోస్

Dec-18-2018
Pasumarthi Poojitha
5 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కుంగ్ పావ్ పొటాటోస్ రెసిపీ గురించి

మీ పిల్లల ముందు ఈ ప్లేట్ ఇంకా ప్లేట్ కాళీ చాలా బాగుంటాయి . మైదా,మొక్కజొన్న పిండి తక్కువ గానే వాడను.

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • మీడియం/మధ్యస్థ
 • పిల్లలకు నచ్చే వంటలు
 • ఆంధ్రప్రదేశ్
 • వేయించేవి
 • చిరు తిండి
 • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 3

 1. బంగాళా దుంప పావుకేజీ
 2. నూనె వేయేంచడానికి సరిపడా
 3. టమాటో సాస్ 2 టేబుల్ స్పూన్స్
 4. సొయా సాస్ 1 టేబుల్ స్పూన్
 5. నువ్వులు వేయేంచినవి 1 టేబుల్ స్పూన్
 6. పంచదార 1 టేబుల్ స్పూన్
 7. మైదా 3 టేబుల్ స్పూన్స్
 8. కార్న్ ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్స్
 9. కొంచం నీళ్లు
 10. చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్
 11. క్యాప్సికమ్ సగం ముక్క కట్ చేసి పెట్టుకోవాలి
 12. శనగ గింజలు 4 టేబుల్ స్పూన్స్
 13. ఉప్పు రుచికి సరిపడా
 14. ఎండు మిర్చి 3 కాయలు
 15. వెల్లులి 4 రెబ్బలు
 16. అనాస్ పువ్వు ఒక్కటి

సూచనలు

 1. ముందుగా బంగాళా దుంపను శుభ్రoగా కడుక్కోవాలి పై తొక్క తీయకూడదు.
 2. పక్కలు ,పైన సమానంగా కట్ చేసుకొని వాటిని మూడు భాగాలుగా కట్ చేసి చతుర్భుజ ఆకారం లో ముక్కలుగా కట్ చేసుకోవాలి.
 3. ఇప్పుడు ఆ ముక్కలు ఒక గిన్నె లో వేసుకొని అందులో మొక్కజొన్న పిండి ,మైదా,ఉప్పు వేసుకొని బంగాళా దుంపలు ముక్కలు కి పట్టేలా కలుపుకొని కొంచం నీళ్లు పోస్త పిండి పట్టుకుంటుంది
 4. ఇప్పుడు పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టి అందులో వేయించటానికి సరిపడా నూనె పోసుకొని బాగా వేడి అయ్యాక కలిపి పెట్టుకునన్న బంగాళాదుంప ముక్కలను వేడి వేడి నూనె లో జాగ్రత్తగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి .
 5. ఆ ముక్కలు బంగారు రంగు లో వచ్చే వరకు వేయేంచాలి. వేగిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి.
 6. ఇప్పుడు అదే కడాయి లో పొయ్యి కట్టేయకుండా శనగ గింజలు తీసుకొని రంగు మారే వరకు వేయేంచాలి ,అదే కడాయి లో మళ్ళీ క్యాప్సికమ్ ముక్కలు రెండు నిమిషాలు అలా వేయేంచి తీసి పక్కన ప్లేట్ లో పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
 7. ఇప్పుడు ఎండుమిర్చి ని 5 నిమిషాలు ఉడికించి తీయాలి చల్లారాక మిక్సీ గిన్నె లో వేసుకొని అదే గిన్నె లో వెల్లులి పొట్టు తీసి వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి.
 8. ఇప్పుడు మరో మూకుడు పెట్టి స్టవ్ వెలిగించి నూనె వేసి అందులో అనాస్ పువ్వు వేసి వేగిన తర్వాత , ఎండు మిర్చి వెల్లులి పేస్ట్ మిశ్రమాన్ని వేసుకోవాలి 3 నిమిషాలు వేగనివ్వాలి.
 9. ఈ లోపు సాస్ కలుపుకోవాలి అందులో టమాటో సాస్,సొయా సాస్,పంచదార ,చిల్లీ సాస్ బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి.
 10. ఎండు మిర్చి వెల్లులి పేస్ట్ వేగిన తరువాత అందులో కలుపుకొని పెట్టుకున్న సాస్ వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత అందులో బంగాళా దుంప ముక్కలు వేసుకొని అంత కలుపుకోవాలి,అందులోనే నువ్వులు వేసుకోవాలి,శనగ గింజలు,క్యాప్సికమ్ ముక్కలు అన్నీ వేసుకొని కలుపుకోవాలి.
 11. వేడి వేడి గా తింటే చాలా బాగుంటాయండీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర