హోమ్ / వంటకాలు / చట్నీ పొడి

Photo of CHUTNEY POWDER by Harini Balakishan at BetterButter
472
4
0.0(0)
0

చట్నీ పొడి

Feb-14-2019
Harini Balakishan
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చట్నీ పొడి రెసిపీ గురించి

ఇది ఒక కర్నాటక వంటకము. నిలువ ఉంచగల చట్నీ. దాదాపు అన్నింటి తో సెట్ అవుతుంది. నెయ్యి లేక మంచి నూనె తో కలుపుకుంటే చపాతీ, పూరి, ఇడ్లీ దోస తో తిన వచ్చు. పెరుగు కలుపుకుంట చపాతీ, జొన్న రొట్టె తో బాగుంటుంది. వేడి వేడి అన్నంలో మంచి నూనె వేసుకుని తిన వచ్చు. పెరుగన్నంలో బాగుంటుంది. పచ్చి అటుకులు మంచి నూనె వేసి కలిపి తింటే బాగుంటుంది. అటుకులు పెరుగు తో తిన వచ్చు. ఆలూ, వంకాయ, దొండకాయ కూర ఉడికిన తర్వాత చట్నీ పొడి కలిపితే బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. రెండు కప్పు సెనగ పప్పు
  2. ఒక కప్పు మిన పప్పు
  3. అరకకప్పు పెసర పప్పు
  4. రెండు చంచా ధనియా
  5. రెండు చంచా జిలకర
  6. ఒక కప్పు ఎండు కొబ్బరి పుడి
  7. చిన్న బెల్లం ముక్క
  8. ఉప్పు
  9. అర చంచా పసుపు
  10. చిటికెడు ఇంగువ
  11. అర కప్పు కారంపుడి
  12. చింత పండు
  13. రెండు చంచా మంచి నూనె

సూచనలు

  1. పప్పులు, ధనియా జిలకర, వేరు వేరు గ దోరగ వేయించాలి. నూనె వేడి చేసి చింత పండు ఫ్రై చేసి పక్క్న పెట్టాలి. కొబ్బరి వేపి పక్కన పెట్టాలి. ఇంగువ పసుపు, కారంపుడి వేసి మాడ కుండ వేపాలి
  2. ముందుగ కొబ్బరి, చ్ంత పండు, కొద్ది గ పప్పు వేసి పొడి గొట్టి, అటు తర్వాత మిగతా విషయాలన్నీ వేసి పొడి గొట్టి కలపాలి అంతే
  3. నెయ్యి లేక మంచి నూనె తో కలుపుకుంటే చపాతీ, పూరి, ఇడ్లీ దోస తో తిన వచ్చు. పెరుగు కలుపుకుంట చపాతీ, జొన్న రొట్టె తో బాగుంటుంది. వేడి వేడి అన్నంలో మంచి నూనె వేసుకుని తిన వచ్చు. పెరుగన్నంలో బాగుంటుంది. పచ్చి అటుకులు మంచి నూనె వేసి కలిపి తింటే బాగుంటుంది. అటుకులు పెరుగు తో తిన వచ్చు. ఆలూ, వంకాయ, దొండకాయ కూర ఉడికిన తర్వాత చట్నీ పొడి కలిపితే బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర