హోమ్ / వంటకాలు / కాజు మసాలా వంకాయ

Photo of Brinjal cashew curry by Deepika K at BetterButter
19
4
0.0(0)
0

కాజు మసాలా వంకాయ

Feb-23-2019
Deepika K
30 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాజు మసాలా వంకాయ రెసిపీ గురించి

ఇది బిర్యానీ, ఫ్రైడ్ రైస్, రోటి, చపాతి అలాగే అన్నం లోకి కూడా చక్కని కాంబినేషన్.చక్కని రుచి తో పాటు ఎనర్జీ కూడా ఇస్తుంది

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • మీడియం/మధ్యస్థ
 • పండుగలాగా
 • ఆంధ్రప్రదేశ్
 • ఉడికించాలి
 • వేయించేవి
 • ప్రధాన వంటకం
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

 1. వంకాయలు -1/4కేజీ
 2. కాజు -1/4కప్
 3. పల్లీలు -1/4కప్
 4. నువ్వులు -1/4cup
 5. ఎండు కొబ్బరి -3 స్పూన్ లు
 6. గసగసాలు -3 స్పూన్స్
 7. ఉల్లిపాయలు -3 పెద్దవి
 8. పచ్చిమిర్చి -4
 9. అల్లం వెల్లుల్లి పేస్ట్ -2 స్పూన్స్
 10. మసాలా దినుసులు -1 స్పూన్
 11. ఆయిల్ -1/2 కప్
 12. కొత్తిమీర -2 రెమ్మలు
 13. గరం మసాలా -1 స్పూన్
 14. కారం -2 స్పూన్స్
 15. ఉప్పు -21/2స్పూన్
 16. పసుపు -1/2స్పూన్

సూచనలు

 1. వంకాయలు మధ్యలో కట్ చేసి ఉప్పు నీళ్లలో వేసుకోవాలి
 2. మిక్సీ లో కట్ చేసిన 2 ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకోవాలి
 3. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ప్లేట్ లో వేసి కొంచం కారం, గరం మసాలా, ఉప్పు వేసి కలుపుకోవాలి
 4. పై మిశ్రమాన్ని కట్ చేసిన వంకాయల్లో కూర్చాలి
 5. పాన్ పెట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేసి, వేడయ్యాక మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసి వేగనివ్వాలి
 6. తరువాత కూర్చిన వంకాయలు వేసి తిప్పుతూ మూత పెట్టండి
 7. ఇలా వేయించుకుని వంకాయలు పక్కన పెట్టుకోండి
 8. మరొక పాన్ పెట్టి గసగసాలు, పల్లీలు, నువ్వులు,కాజు ఒక్కొక్కటిగా వేస్తు దోరగా వేయించుకోవాలి
 9. వేయించినవి చల్లారాక కొద్దిగా వాటర్ పోస్తూ మిక్సీ పట్టుకోవాలి
 10. ఇందాక వంకాయలు వేయించుకున్న పాన్ లో వంకాయలు మాత్రం తీసేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇంకొద్దిగా ఆయిల్ పోసి కొంచం కారం, గరం మసాలా,పసుపు, సన్నగా తరిగిన ఒక ఆనియన్ వేసి వేగనివ్వాలి
 11. వేగాక మిక్సీ పట్టిన కాజు మిశ్రమాన్ని పోయండి
 12. గ్రేవీ దగ్గరపడ్డాక 2 స్పూన్స్ ఉప్పు వేసి కలపండి
 13. తరవాత వేయించిన వంకాయలు వేసి 5నిముషాలు మూత పెట్టండి
 14. చివరగా కొత్తిమీర తో గార్నిష్ చేయండి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర