హోమ్ / వంటకాలు / రాజ్మా కట్లెట్

Photo of Rajma kabab by kalyani shastrula at BetterButter
43
5
0.0(0)
0

రాజ్మా కట్లెట్

Feb-27-2019
kalyani shastrula
60 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాజ్మా కట్లెట్ రెసిపీ గురించి

రాజ్మా తో చేసే స్నాక్స్

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తెలంగాణ
 • తక్కువ నూనెలో వేయించటం
 • చిరు తిండి
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

 1. కప్ రాజ్మా
 2. 4 ఆలుగడ్డలు
 3. 3పచ్చిమిర్చి
 4. అల్లం ముక్క ఇంచ్
 5. నూనె 4tbsn
 6. కొత్తిమీర కట్ట
 7. ధనియపొడి 1 స్పూన్
 8. చాట్ మసాలా పొడి 1స్పూన్
 9. జిలకర 1స్పూన్
 10. గరం మసాలా పొడి 1స్పూన్
 11. కారం 1స్పూన్
 12. ఉప్పు తగినంత

సూచనలు

 1. ముందుగా ఆలుగడ్డలు ఉడికించి పెట్టుకోవాలి .అదే కుక్కర్లో ఒక రోజంతా నానబెట్టుకున్న రాజ్మా వేసి నీళ్లు పోసి ఉడికించుకోవాలి .
 2. రాజ్మా ఉడికే లోపు ఉడికించిపెట్టుకున్న ఆలు పొట్టు తీసి పెట్టుకోవాలి
 3. ఆలూను మెత్తగా చిదిమి కాని తురిమి కాని పెట్టుకోవాలి .
 4. ఈలోపు రాజ్మా ఉడికిపోతుంది .
 5. చల్లారాక రాజ్మాను మీక్సీ చేసిపెట్టుకోవాలి
 6. మీక్సీ చేసిన రాజ్మా ని ఆలు లో వేసి కలపాలి
 7. అల్లం తురుముకోవాలి .పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలి
 8. ఆలు రాజ్మా మిశ్రమం లో అల్లం పచ్చిమిర్చి వేయాలి
 9. కొత్తిమీర తరుగు వేయాలి
 10. తగినంత ఉప్పు వేసి ,జిలకర కారం ,గరం మసాలా ,చాట్ మసాలా ,ధనియా పొడి ,చిటికెడు ఇంగువ ,చిటికెడు పసుపువేసి కలుపుకోవాలి
 11. అన్నీ వేసి కలిపాక ఇలా ముద్దగా తయారవుతుంది
 12. దీనిని ఉండలుగా చేసుకోవాలి .
 13. ఒక్కొక్క ఉండను చేతికి నూనె రాసుకొని కట్లెట్ షేప్ గా చేసుకొని పెట్టుకోవాలి .
 14. చపాతీ పెనం మీద నూనె వేసి కోప్తాలను పెట్టి రెండువైపులా బాగా కాల్చుకోవాలి
 15. ఇలా నూనెలో కాలిన కోఫ్తా లను పెనం చివర్లో పెట్టి వేరే పచ్చి కోఫ్తాలను మధ్యలో నున్న నూనెలో వేసి కాల్చుకోవాలి .
 16. దీనిని గ్రీన్ చట్నీ తో కాని టమాటా సాస్ తో కాని తింటే బాగుంటాయి .
 17. కొత్తిమీర ,అల్లం పచ్చిమిర్చి ,ధనియా పొడి ,కొన్ని పుదీనా ఆకులు మీక్సీ జార్ లో వేసి తగినంత ఉప్పు చిటికెడు ఇంగువ వేసి పెరుగు వేసి గ్రైండ్ చేస్తే గ్రీన్ చట్నీ అయిపోయినట్టే .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర