హోమ్ / వంటకాలు / రాజ్మా రసం

Photo of Kidney bean stock rasam by Rashmi SudhiMurthy at BetterButter
788
2
0.0(0)
0

రాజ్మా రసం

Feb-28-2019
Rashmi SudhiMurthy
60 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాజ్మా రసం రెసిపీ గురించి

ఈ చారు చేయటం చాలా సులభం.ఇందులో రాజ్మా ఉడికించిన నీళ్ళు, కంది పప్పు వేయటం వలన మంచి పౌష్టికాహారం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కర్ణాటక
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కంది పప్పు 1/4 కప్
  2. ఉడికించిన రాజ్మా నీళ్ళు/ రాజ్మా స్టాక్ 2 కప్పులు
  3. టొమాటో 1
  4. చింతపండు రసం 2 టేబుల్ స్పూన్లు
  5. బెల్లం చిన్న ముక్క
  6. రసం పుడి కోసం : జీలకర్ర 1 టేబుల్ స్పూన్
  7. ధనియాలు 1/2 టేబుల్ స్పూన్
  8. మెంతెలు 4
  9. ఆవాలు చిటికెడు
  10. ఎండు మిరపకాయలు 4(బ్యాడిగి)
  11. నూనె 2 టేబుల్ స్పూన్లు
  12. కొత్తిమీర తరుగు 2 టేబుల్ స్పూన్లు
  13. ఉప్పు రుచికి సరిపడా
  14. పోపు కోసం: ఆవాలు,జీలకర్ర 1 టీ స్పూన్
  15. కరివేపాకు 2 రెమ్మలు
  16. ఇంగువ 1/4 టీ స్పూన్

సూచనలు

  1. ముందుగా రసం పొడి మసాలా కోసం పాన్ లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి ఎండుమిరపకాయలు,ఆవాలు, మెంతెలు, జీలకర్ర, ధనియాలు దోరగా వేయించి పుడి చేసి పెట్టుకోవాలి
  2. కందిపప్పు , టొమాటో కుక్కర్ లో పసుపు వేసి ఉడికించాలి.మెదిపి పెట్టుకోవాలి
  3. ఇప్పుడు ఒక గిన్నెలో ఉడికించిన రాజ్మా నీళ్ళు, మెదిపిన పప్పు వేసి అందులో ఉప్పు,చింతపండు రసం, బెల్లం వేసి మరగనివ్వాలి
  4. ఇప్పుడు అందులోకి సిద్ధం చేసుకున్న రసం పుడి, కొత్తిమీర వేసి 2 నిమిషాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి
  5. చివరగా పోపు వేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర