హోమ్ / వంటకాలు / వంకాయ కూర.

Photo of Brinjal curry. by దూసి గీత at BetterButter
873
6
0.0(0)
0

వంకాయ కూర.

Mar-22-2019
దూసి గీత
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వంకాయ కూర. రెసిపీ గురించి

తెలుగు ఇళ్ళల్లో వంకాయ కూర ఇష్టపడని వారుండరేమో...ఈ కూర పూర్వం రోజుల్లో పెళ్ళిళ్ళలో ఎక్కువగా వండేవారు.అందుకే దీనిని సంతర్పణ కురలేక వంకాయ ముద్ద అని కూడా అంటారు.చాలా రుచిగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • సైడ్ డిషెస్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. వంకాయలు- 1/4 కిలో.
  2. టమాటా- 1
  3. శనగలు/ పచ్చిబఠాణీ- 1/4 కప్పు.
  4. అల్లం, పచ్చిమిర్చి పేస్ట్- 1/2 చెంచా.
  5. చింతపండు గుజ్జు- 1 చెంచా.
  6. మెంతిపొడి కోసం: శనగపప్పు, మినప్పప్పు,ధనియాలు,మెంతులు, జీలకర్ర,- అన్నీకలిపి 1/2 కప్పు.
  7. ఎండుమిర్చి - 5
  8. వేరుశనగపలుకులు/ జీడిపప్పు ( ఆప్షనల్)- 1/4 కప్పు.
  9. ఉప్పు- 1/2 చెంచా.
  10. నూనె అవసరం అసలుండదు.
  11. ఇంకా రుచికోసం కావాలనుకుంటే - 1లేక 2 చెంచాలు.

సూచనలు

  1. ముందుగా మెంతిపొడి కోసం చెప్పిన దినుసులన్నీ ఎర్రగా వేయించి బరకగా పొడి చేసి పెట్టుకోవాలి.( ఈ మెంతి పొడి ఎక్కువ మొత్తంలో చేసి ఉంచుకుంటే,బెండకాయ,దొండకాయ,కేప్సికమ్,కంద, ఇలా అన్నిటికీ వాడుకోవచ్చు).
  2. మూకుడులో నీళ్ళు పోసి,వంకాయ,బంగాళదుంప లు క్యూబ్స్ లా కట్ చేసి వెయ్యాలి 2 నిమిషాలు అయ్యేక,ఉప్పు,పసుపు వెయ్యాలి. కొంచెం ఉడికిన తర్వాత, టమాటా,అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఉడికించాలి.
  3. తర్వాత, శనగలు/ పచ్చి బఠాణీలు వెయ్యాలి. ఇదే సమయంలో చింతపండు గుజ్జు కూడా వెయ్యాలి. అన్నీ కలిపి 5 నిమిషాలు ఉడికిన తర్వాత మెంతి పొడి రెండు/ మూడు చెంచాలు వేసి, 5 నిమిషాలు ఉంచి ,కరివేపాకు,కొత్తిమీర వేసి దించేయాలి. ఎంతో రుచిగా ఉండే వంకాయ సంతర్పణ కూర తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర