దాల్ ప్ఫ్రై | Dal Fry Recipe in Telugu

ద్వారా Paramita Majumder  |  3rd May 2017  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Dal Fry by Paramita Majumder at BetterButter
దాల్ ప్ఫ్రైby Paramita Majumder
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

462

0

దాల్ ప్ఫ్రై

దాల్ ప్ఫ్రై తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Dal Fry Recipe in Telugu )

 • 1 కప్పు శనగపప్పు
 • నీళ్ళు కావలసినన్ని
 • 1 ఉల్లిపాయ సన్నగా తరిగినది
 • టమోటాలు తరిగినవి 2
 • 2 పచ్చి మిర్చి సన్నగా తరిగినది
 • 2 అంగుళాల పొడవు అల్లం
 • 5 వెల్లుల్లి రెబ్బలు
 • 2 పెద్దచెంచాలు కసురీ మేతీ
 • పసుపు పొడి 1/2 చెంచా
 • ఉప్పు రుచికి సరిపడా
 • అలంకరణకి కొత్తిమీర తరిగినది
 • పోపు కోసం:
 • 1 చెంచా కాశ్మీరీ ఎండు కారం పొడి
 • 1/2 చెంచా ఇంగువ
 • 1 పెద్ద చెంచా ఆవాలు నల్లవి
 • 1 పెద్ద చెంచా మెంతులు
 • 1 పెద్ద చెంచా జీలకర్ర
 • 2 ఎండు మిర్చి
 • నెయ్యి 1-2 చెంచాలు

దాల్ ప్ఫ్రై | How to make Dal Fry Recipe in Telugu

 1. పప్పుని నీటిలో కడిగి 30-40 నిమిషాలు నానవెయ్యండి.
 2. పప్పుని నీళ్ళు, ఉప్పు మరియు పసుపు వేడి 5-6 విజల్స్ వరకు ప్రషర్ కుక్ చేయండి
 3. ఆవిరిని విడుదల చేయడానికి ఆగండి.
 4. పప్పులని వడగట్టండి, నీటిని దాచండి.
 5. నాన్ - స్టిక్ ప్యానులో నూనెని వేడి చేయండి.
 6. ఇది వేడిగా ఉన్నప్పుడు, తురిమిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి అందులో వేయండి.
 7. కొంత సమయం కలపండి. తరిగిన ఉల్లిపాయలు వేసి, ఉల్లిపాయలు లేత గోధుమ రంగులోకి వచ్చే దాకా కలపండి.
 8. టమోటాలు మరియు 1 చెంచా నీళ్లు వేయండి.
 9. టమోటాలు మెత్తగా అయ్యేదాకా వండండి.
 10. ఇప్పుడు పప్పులని వేయండి.
 11. మసాలాతో బాగా కలపండి.
 12. దాచిన పప్పు నీళ్ళని, ఉప్పుని వేయండి, దాన్ని ఉడకనివ్వండి.
 13. అది కావలసినట్లుగా రాగానే గ్యాస్ ని ఆపేయండి.
 14. ఇచ్చిన పదార్థాలతో పోపు వేసి, దాని మీద పోయండి.
 15. కొత్తిమీర ఆకులు మరియు వేయించిన కరివేపాకుతో అలంకరించండి.
 16. అన్నంతో వేడిగా వడ్డించండి.

Reviews for Dal Fry Recipe in Telugu (0)