కార రోటి విత్ బీరకాయ సెనగపప్పు కూర | Kara roti with ridge gourd and Bengal gram curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  19th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Kara roti with ridge gourd and Bengal gram curry recipe in Telugu,కార రోటి విత్ బీరకాయ సెనగపప్పు కూర, Sree Vaishnavi
కార రోటి విత్ బీరకాయ సెనగపప్పు కూరby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  14

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

0

0

కార రోటి విత్ బీరకాయ సెనగపప్పు కూర వంటకం

కార రోటి విత్ బీరకాయ సెనగపప్పు కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kara roti with ridge gourd and Bengal gram curry Recipe in Telugu )

 • బీరకాయ సెనగపప్పు కూర
 • సెనగపప్పు – 100 గ్రాములు
 • బీరకాయలు – 250 గ్రాములు
 • ఉల్లిపాయ -1
 • పసుపు -1/4 చెంచా
 • కారంపొడి – 1 చెంచా
 • ఉప్పు – తగినంత
 • అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 చెంచా
 • గరం మసాలా పొడి-1/2 చెంచా
 • కరివేపాకు -1 రెబ్బ
 • నూనె – 3 చెంచా
 • కార రోటి
 • గోధుమ పిండి 1 కప్
 • ఉప్పు తగినంత
 • కారం తగినంత
 • నీళ్లు తగినంత

కార రోటి విత్ బీరకాయ సెనగపప్పు కూర | How to make Kara roti with ridge gourd and Bengal gram curry Recipe in Telugu

 1. సెనగపప్పును కడిగి నీళ్లు పోసి అరగంట నాననివ్వాలి.
 2. బీరకాయలు చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
 3. ప్యాన్ లో నూనె వేడిచేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి మెత్తబడేవరకు వేయించాలి. 
 4. ఇందులో పసుపు, కరివేపాకు,అల్లంవెల్లుల్లి పేస్ట్,కారంపొడి వేసి రెండు నిమిషాలు వేయించాలి. 
 5. సెనగపప్పు ఇందులో వేసి తడి పోయేవరకు వేయించాలి. 
 6. బీరకాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టి మూతపెట్టాలి. 
 7. ముక్కలు మగ్గినతర్వాత కప్పు నీళ్లు పోసి చిన్నమంటపై ఉడికించాలి. 
 8. పప్పు ఉడికి దగ్గర పడ్డాక గరం మసాలా కలిపి దింపేయాలి.
 9. సన్నగా తరిగిన కొత్తిమిర చల్లి వడ్డించాలి. 
 10. ఈ కూర చపాతీలు అన్నంలో చాలా బావుంటుంది.
 11. కార రోటి
 12. ముందుగా గోధుమపిండి లో ఉప్పు, కారం నీళ్లు పోసుకుని ముద్ద ల కలుపుకోవాలి
 13. దానిని కాసేపు పక్కన పెట్టిన తరువాత స్టవ్ వెలిగించి దీనిని చపాతి ల వత్తు కొని కాల్చుకోవాలి అంతే

Reviews for Kara roti with ridge gourd and Bengal gram curry Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo