కాల్చిన వంకాయ పచ్చడి | Smoky brinjal Recipe in Telugu

ద్వారా Rashmi SudhiMurthy  |  25th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Smoky brinjal recipe in Telugu,కాల్చిన వంకాయ పచ్చడి, Rashmi SudhiMurthy
కాల్చిన వంకాయ పచ్చడిby Rashmi SudhiMurthy
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

కాల్చిన వంకాయ పచ్చడి వంటకం

కాల్చిన వంకాయ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Smoky brinjal Recipe in Telugu )

  • పెద్ద వంకాయలు 2
  • క్యాప్సికమ్ 1
  • ఉల్లిపాయలు 2
  • టొమాటో 1
  • పచ్చి మిరపకాయలు 4
  • వెల్లుల్లి రెబ్బలు 15
  • కరివేపాకు 10 రెమ్మలు
  • కొత్తిమీర తరుగు కొంత
  • ఉప్పు రుచికి సరిపడా
  • నూనె 5 టేబుల్ స్పూన్లు
  • కారం పుడి 2టేబుల్ స్పూన్లు
  • ధనియ పుడి 1/2 టీ స్పూన్
  • గరం మసాలా 1/2 టీ స్పూన్
  • కసూరి మేథీ 1/2 టీ స్పూన్
  • పోపు దినుసులు(ఆవాలు,మినపప్పు, జీలకర్ర)
  • పసుపు 1/4 టీ స్పూన్
  • చింతపండు రసం 2టేబుల్ స్పూన్లు
  • బెల్లం చిన్న ముక్క
  • నీళ్ళు 1/2 కప్

కాల్చిన వంకాయ పచ్చడి | How to make Smoky brinjal Recipe in Telugu

  1. ముందుగా వంకాయలు కడిగి దానికి కొంచెం నూనె రాసి ఒక గాటు పెట్టుకోవాలి
  2. గాటు పెట్టిన వంకాయ లో పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కలు కూరి స్టవ్ పైన మంట తగిలేలా కాల్చుకోవాలి
  3. అవి మెత్తపడేవరకు కాల్చాక అందులో నుంచి పచ్చిమిర్చి, వెల్లుల్లి తీసి దంచి పెట్టుకోవాలి
  4. వంకాయలు చల్లారాక తొక్క తీసి కడిగి చిదిమి పెట్టుకోవాలి
  5. స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేసి వేడి అయ్యాక పోపు,కరివేపాకు వేయాలి
  6. అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేపాలి
  7. అవి వేగేటప్పుడు అందులో దంచిన పచ్చిమిర్చి వె్ల్లుల్లి ముద్ద వేయాలి
  8. తరువాత క్యాప్సికమ్,టొమాటో ముక్కలు ఒకదాని తరువత ఒకటి వేసి వేపాలి
  9. ఇప్పుడు పసుపు, ఉప్పు,కారం,గరంమసాలా, ధనియాలపొడి వేయాలి
  10. అందులో చిదిమిన వంకాయలు వేయాలి
  11. ఇప్పుడు దాన్లో చింతపండు రసం,కొంచెం బెల్లం,తగినంత నీళ్ళు వేసి మరిగించాలి
  12. చివర్లో కొత్తిమీర,కసూరి మేథీ వేసి 2 నిమిషాలు స్టవ్ పై ఉంచి బౌల్ లోకి తీసుకోవాలి
  13. రుచి మరియు ఆరోగ్య కర మైన వంకాయ పచ్చడి చపాతీ లోకి చాలా బాగుంటుంది

Reviews for Smoky brinjal Recipe in Telugu (0)