హోమ్ / వంటకాలు / కంది పప్పు భక్షాలు

Photo of Toor dal puran poli  by Sadhhna praveen at BetterButter
415
5
0.0(0)
0

కంది పప్పు భక్షాలు

Feb-08-2019
Sadhhna praveen
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కంది పప్పు భక్షాలు రెసిపీ గురించి

ప్రోటీన్ రిచ్ ఫుడ్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • తెలంగాణ
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కంది పప్పు ఒక కప్పు
  2. గోధుమ పిండి రెండు కప్పులు
  3. తాటి బెల్లం ఒక కప్పు
  4. సొంపు ఒక టీ స్పూన్
  5. ఇలాయిచి 4
  6. నూనె 2-3 టేబుల్ స్పూన్స్
  7. నెయ్యి 4-5 టేబుల్ స్పూన్స్

సూచనలు

  1. ముందుగా కందిపప్పు ని బాగా కడిగి నిండా నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి
  2. ఇప్పిడు మిక్సీ జార్ లో తాటి బెల్లం ఇలాయిచి సొంపు వేసి మెత్తగా రుబ్బుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో నానిన కందిపప్పు ని వేసుకోవాలి
  4. 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి
  5. స్టవ్ వెలిగించి కందిపప్పు సగం ఉడికే వరకు ఉడికించుకోవాలి
  6. జాగ్రత్త గా ఉడికించాలి ఎక్కువ ఉడికిన పూర్ణం మెత్తగా ఐపోతుంది
  7. కందిపప్పు పలుకు గా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  8. ఇప్పుడు నీరంతా వార్చేయాలి
  9. ఇప్పుడు ఈ ఉడికిన పప్పు ని ఒక ప్లేట్ లో వేసి ఫ్యాన్ కి ఆర నివ్వాలి
  10. పప్పు డ్రై గా అవ్వాలి
  11. ఇప్పుడు గోధుమ పిండి ని చపాతీ పిండి కంటే కొంచెము మెత్తగా కలుపుకోవాలి
  12. ఇప్పుడు ఆరిన పప్పు ని మిక్సీ లో మెత్తగా రుబ్బుకోవాలి
  13. ఇప్పుడు మెత్తగా అయిన పప్పులో ముందుగా రుబ్బుకున్న తాటి బెల్లం పొడిని వేసి బాగా కలుపుకోవాలి
  14. ఇప్పుడు మనకు పూర్ణం స్టఫ్ రెడి అయింది
  15. ఇప్పుడు గోధుమ పిండి చిన్న ముద్దలు చేసి పెట్టుకోవాలి
  16. ఒక్కొముద్దలో కొద్దిగా కందిపప్పు ముద్దని స్టఫ్ చేసుకోవాలి
  17. ఇలా అన్ని చేసి రెడి పెట్టుకివాలి
  18. ఇప్పుడు చపాతీలు లాగా వత్తుకోవాలి
  19. ఇప్పుడు వీటిని నెయ్యి వేస్తూ కాల్చుకోవాలి
  20. అంతే భక్షాలు రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర