హోమ్ / వంటకాలు / 9 రకాల పప్పుల తో పప్పు

Photo of Navratan dal by Shobha.. Vrudhulla at BetterButter
2089
3
0.0(0)
0

9 రకాల పప్పుల తో పప్పు

Feb-28-2019
Shobha.. Vrudhulla
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

9 రకాల పప్పుల తో పప్పు రెసిపీ గురించి

ఇది అన్ని పప్పులు కలవటం వల్ల చాలా బలమయిన ఆహారం. ఈ పప్పు చాలా రుచిగాను ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • రాత్రి విందు
  • ఉత్తర భారతీయ
  • ఉడికించాలి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. శనగపప్పు 1/4 కప్పు
  2. పొట్టు పెసరపప్పు 1/4 కప్పు
  3. ఎర్ర కంది పప్పు 1/4 కప్పు
  4. పొట్టు లేని పెసర పప్పు 1/4 కప్పు
  5. మినగపప్పు 2 టేబుల్ స్పూన్లు
  6. కంది పప్పు 1/4 కప్పు
  7. రాజ్మా 1/4 కప్పు
  8. సొయా గింజలు ఒక పిడికెడు
  9. ఉల్లిపాయలు 1 కప్ తరిగినవి
  10. టమాట 1 కప్ తరిగినవి
  11. పచ్చిమిర్చి నిలువుగా కట్ తరిగినవి 3
  12. 1 పెద్ద ఇలాయిచి
  13. 1 ఇంచ్ దాల్చిన చెక్క
  14. 1చంచ అల్లం వెల్లుల్లి ముద్ద
  15. ఉప్పు తగినంత
  16. కారము 2 చంచాలు
  17. పసుపు అర చెంచా
  18. ధనియాల పొడి 2 చంచాలు
  19. ఆవాలు 1 చెంచా
  20. జీలకర్ర 1 చెంచా
  21. ఇంగువ 1/8 స్పూన్
  22. నూనె మరియు నెయ్యి అర కప్పు

సూచనలు

  1. అన్నీ పప్పులు మరియు సొయా గింజలు కలిపి బాగా కడిగి 4 to 5 గంటలు నానపెట్టి తీసి కుక్కర్ లో ఉడికించి ఉంచుకోవలెను
  2. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె నెయ్య కలిపి వేసి వేడి అయ్యాకా అందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి వేగాక కరివేపాకు,పచ్చిమిర్చి ముక్కలు,దాల్చిన చెక్క మరియు పెద్ద ఇలాయిచి వేసి వేగనివ్వాలి
  3. అవి వేగాక అందులో ఉల్లిపాయలు వేసి బ్రౌన్ రంగు వచ్చేక టమాట ముక్కలు వేసి బాగా మెత్త పడే వరకు ఉంచాలి.
  4. టమాటాలు మగ్గిన తరువాత ఉప్పు,పసుపు.,కారము,ధనియాల పొడి వేసి బాగా వేగాక అందులో ఉడికిన పప్పు వేసి బాగాకలిపి మరో 5 నిమిషాలు సిమ్ లో స్టవ్ పెట్టి ఉడకనివ్వాలి
  5. అన్నీ బాగా ఉడికి దగ్గర పడ్డాక కాస్త బట్టర్ వేసి తిప్పి కొత్తిమీర వేసుకోవలెను
  6. అంతే ఎంతో రుచి కలిగిన 9రకాలా పప్పు తయ్యార్.రోటీ తో కానీ అన్నం తో కానీ తింటే వేడిగా చాలా బావుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర