గ్రిల్డ్ టోఫు కబాబ్ | Grilled Tofu Kebabs Recipe in Telugu

ద్వారా Abhinetri V  |  27th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Grilled Tofu Kebabs recipe in Telugu,గ్రిల్డ్ టోఫు కబాబ్, Abhinetri V
గ్రిల్డ్ టోఫు కబాబ్by Abhinetri V
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

గ్రిల్డ్ టోఫు కబాబ్ వంటకం

గ్రిల్డ్ టోఫు కబాబ్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Grilled Tofu Kebabs Recipe in Telugu )

  • బంగాళదుంప(ఉడికించిన)- 1
  • క్యారెట్ (ఉడికించిన) - 1
  • టోఫు (తురిమిన)- 1 కప్పు
  • సెనగపప్పు (నానబెట్టిన) - 2 టేబుల్ స్పూన్స్
  • అటుకుల పొడి/పౌడర్ - 2 టేబుల్ స్పూన్స్
  • కారంపొడి- 2 టీస్పూన్స్
  • ఉప్పు- తగినంత
  • నూనె- 2 టీస్పూన్స్
  • అల్లం- 1/4 టీస్పూన్
  • కరివేపాకు(సన్నగా తరిగిన) - 1 టీస్పూన్
  • ఉల్లి( సన్నగా తరిగిన)- 1/2 కప్పు
  • లవంగాలు - 2
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • పల్లి(ఉడకబెట్టిన)- 1/2 కప్పు

గ్రిల్డ్ టోఫు కబాబ్ | How to make Grilled Tofu Kebabs Recipe in Telugu

  1. నానబెట్టిన సెనగపప్పు ని మరియు పల్లిలని విడిగా ఉడకబెట్టుకోవాలి
  2. అన్ని పదార్ధాలని సిద్ధం చేసుకోవాలి.
  3. అటుకులని పొడి చేసుకోవాలి.అలాగే మిగిత పదార్ధాలని సిద్ధం చేసుకోవాలి.
  4. మసాల కి కావాల్సిన పదార్ధాలని సిద్ధం చేసుకోవాలి.
  5. ఇప్పుడు ఒక డ్రై మిక్సీ జార్ లో ఉడకబెట్టిన సెనగపప్పు, ఉడకబెట్టిన పల్లి,కూరగాయలు(బంగాళదుంప,క్యారెట్) ని బరకగా రుబ్బుకోవాలి.
  6. ఇందులో మసాలా దింసులని కూడా వేసి చక్కగా రుబ్బుకోవాలి.
  7. ఇప్పుడు తురిమిన టోఫు, తగినంత ఉప్పు వేసుకోవాలి.
  8. ఈ మిశ్రమంలో తరిగిన ఉల్లి, కరివేపాకు, అటుకుల పొడి, కారం వేసి శుభ్రంగా కలపాలి.
  9. మిశ్రమం బరకగా ఉండాలి.
  10. ఇంతలోపు గ్రిల్ ని 10నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి.
  11. ప్రీహీట్ అయ్యేలోపు, వుడెన్ స్క్యువెర్స్ లేదా చాప్ స్టిక్స్ ని మంచి నీటి లో 15 నిమిషాలు నానబెట్టాలి.ఇలా చేస్తే మిశ్రమం వీటిని అంటుకోదు.
  12. ఈస్టిక్స్ పై నూనె రాయాలి.
  13. మిశ్రమం లో కొద్దీ పాటి ముద్ద ని తీసుకొని కబాబ్ లాగా తయ్యార్ చేసుకొని స్టిక్స్ పై పెట్టుకోవాలి. వీటికి నూనె రాయాలి.
  14. ఈ కబాబ్స్ ని గ్రిల్ లో పెట్టి 25 నుండి 30 నిముషాల వరకు 250 డిగ్రీ C వద్ద కుక్ చేసుకోవాలి.
  15. టోఫు గ్రిల్డ్ కబాబ్స్ టీ తో లేదా కాఫీ తో సర్వ్ చేసుకోవచ్చు.

Reviews for Grilled Tofu Kebabs Recipe in Telugu (0)