బ్రెడ్ కచోరి | Bread kachori Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  27th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Bread kachori recipe in Telugu,బ్రెడ్ కచోరి, Sree Vaishnavi
బ్రెడ్ కచోరిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

బ్రెడ్ కచోరి వంటకం

బ్రెడ్ కచోరి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bread kachori Recipe in Telugu )

  • బ్రెడ్ 5-6
  • నీళ్లు తగినంత
  • నూనె వేయించడానికి సరిపడ
  • బంగాళదుంప 1
  • పుట్నాల పొడి 2-3 చెంచాలు
  • ఉప్పు తగినంత
  • కారం 1 చెంచా
  • ఆంచూర్ 1/2 చెంచా
  • గరం మసాలా 1 చెంచా
  • కారం 1 చెంచా
  • కట్టా మీఠా చట్నీ 2-3 చెంచాలు

బ్రెడ్ కచోరి | How to make Bread kachori Recipe in Telugu

  1. ముందుగా బ్రెడ్ చివర్లు కట్ చేసుకోవాలి
  2. ఇప్పుడు ఒక కడాయి లో నూనె వేసుకొని కాచుకోవాలి
  3. ఇప్పుడు ఒక గిన్నె లో ఉడికించిన బంగాళదుంప వెసి మెత్తగా చేసుకోవాలి
  4. అందులో పుట్నాల పొడి, ఉప్పు ,కారం గరం మసాలా, ఆంచూర్ ,కట్టా మీఠా చట్నీ ,వెసి బాగా కలుపుకోవాలి
  5. ఇప్పుడు బ్రెడ్ ని గుండ్రముగా కట్ చేసుకొని మధ్యలో తడి రాసి బంగాళదుంప ని పెట్టుకొని మరో బ్రెడ్ ముక్కతో మూసుకోవాలి
  6. వీటిని కాగిన నూనె లో రెండు వైపులా వేయించుకోవడమే

నా చిట్కా:

బంగాళదుంప బదులు ఉల్లిపాయ పెట్టి వేయించుకోవచు

Reviews for Bread kachori Recipe in Telugu (0)