మత్రి చాట్ | Mathri chat Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  1st Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Mathri chat recipe in Telugu,మత్రి చాట్, Sree Vaishnavi
మత్రి చాట్by Sree Vaishnavi
  • తయారీకి సమయం

    5

    1 /4గంటలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

మత్రి చాట్ వంటకం

మత్రి చాట్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mathri chat Recipe in Telugu )

  • మత్రి 5-6
  • తరిగిన ఉల్లిపాయ 2
  • తరిగిన పచ్చిమిరపకాయలు 3
  • తరిగిన టమాటో 1
  • ఉప్పు తగినంత
  • కారం 1 చెంచా
  • ఛాట్ మసాలా 1/2 చెంచా
  • కొత్తిమీర తరిగినది 2 చెంచాలు
  • జీలకర్ర పొడి 1 చెంచా
  • నిమ్మరసం 1 చెంచా
  • సన్నకారపూస కొద్దిగా
  • కొత్తిమీర పుదీనా చట్నీ 1 చెంచా
  • కట్టా మీఠా చట్నీ 1 చెంచా
  • ఉడికించిన బాటని 2 కప్పులు
  • తురిమిన క్యారెట్ 1
  • పెరుగు 2-3 చెంచాలు
  • బీట్ రూట్ తురిమినది 2 చెంచాలు
  • నీళ్లు తగినంత
  • గరం మసాలా 1 చెంచా

మత్రి చాట్ | How to make Mathri chat Recipe in Telugu

  1. ముందుగా బఠాణి ని నానబెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి నీళ్లు, ఉప్పు, పసుపు, వేసి
  2. అది ఉడికిన తరువాత ఒక పెనం తీసుకొని దాని మీద నూనె వేసుకోవాలి
  3. నూనె వేడి అయ్యిన తరువాత దాంట్లో ఉల్లిపాయ ,పచ్చిమిర్చి ,క్యారెట్ వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి
  4. దాంట్లో ఉడికిన బఠాణి నీళ్లతో వేసుకోవాలి
  5. దానిని 5 నిమిషాలు ఉడికించుకోవాలి నీళ్లు ఇంకే వరకు
  6. తరువాత చిదిపిన మత్రి వేసుకోవాలి
  7. దానిమీద తగినంత ఉప్పు, కారం ,ఛాట్ మసాలా, గరం మసాలా ,నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి
  8. ఇప్పుడు వేడి వేడి ఛాట్ రెడీ
  9. దానిని సెర్వింగ్ బౌల్ లోకి తీసుకొని దాని మీద కొత్తిమీర పుదీనా చట్నీ, కట్ట మీఠా చట్నీ, పెరుగు ,కారపూస ,పచ్చి ఉల్లిపాయ, టమాట తురిమిన క్యారెట్ తిరిమిన బీట్రూట్, కొత్తిమీర ,కొంచం ఉప్పు, కారం ,గరం మసాలా, ఛాట్ మసాలా , నిమ్మసరం ,వేసుకొని సర్వ్ చేసుకోవడమే

నా చిట్కా:

మీకు నచ్చితే సమోసా కూడా చిదిపి వేసుకోవచ్చు

Reviews for Mathri chat Recipe in Telugu (0)