మసాలా పూరి | MASALA PURI Recipe in Telugu

ద్వారా Ram Ram  |  3rd Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • MASALA PURI recipe in Telugu,మసాలా పూరి, Ram Ram
మసాలా పూరిby Ram Ram
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

మసాలా పూరి వంటకం

మసాలా పూరి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make MASALA PURI Recipe in Telugu )

  • మైదా 1కప్పు
  • బొంబాయి రవ్వ 1కప్పు
  • ఉప్పు సరిపడా
  • ఉడికించిన శనగలు 5స్పూన్లు
  • ఉడికించిన బంగాళదుంప 1
  • చాట్ మసాలా 2స్పూన్లు
  • కారం 2స్పూన్లు
  • నిమ్మకాయ 1
  • కొత్తిమీర కొద్దిగా
  • పుదీనా కొద్దిగా
  • నూనె డీప్ ఫ్రైకి

మసాలా పూరి | How to make MASALA PURI Recipe in Telugu

  1. ముందుగా 1కప్పు మైదా 1కప్పు బొంబాయి రవ్వ 2స్పూన్ల నూనె ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోస్తూ పూరి పిండిలా కలుపుకుని 10నిమిషాలు పక్కన పెట్టుకోవాలి...
  2. ఈలోపు శనగలు బంగాళాదుంపని ఉడికుంవహుకోవాలి..
  3. ఇప్పుడు ఒక పెద్దది మందంగాను పల్చగాను కాకుండా పురిలా చేసుకుని రౌండ్ మూతతో పురిలాల కట్ చేసుకోవాలి...
  4. ఇప్పుడు డీప్ ఫ్రైకి నూనె స్టవ్ మీద పెట్టి వేడి అయ్యిన తర్వాత కట్ చేసిన పూరీలను వేసి నూనెలోకి గారిటతో వొత్తుతుంటే పూరీలు ఉబ్బి వస్తాయి..బంగారు రంగులో వేయించుకుని పక్కకు తీసుకోవాలి..
  5. ఇప్పుడు ఉడికించిమ బంగాళాదుంపని తొక్క తీసి మాష్ చేసి ఉప్పు కారం1స్పూన్ 1స్పూన్ చాట్ మసాలా వేసి అంత బాగా కలుపుకుని పెట్టుకోవాలి...
  6. ఇప్పుడు పూరీలను ఒక ప్లేటులో అమర్చి కన్నం చేసి..బంగాళదుంప మిశ్రమాన్ని అన్ని పూరీలలో కొద్దికొద్దిగా పెట్టాలి ..
  7. ఇప్పుడు ఇంకో స్పూన్ చాట్ మసాలా,కొద్దిగా ఉప్పు,1స్పూన్ కారం అన్నీటి. మీద. చల్లుకోవాలి..ఇప్పుడు ఉడికించిన శనగలు పుదీనా కొత్తిమీర అన్నింటిలో వేసుకోవాలి...
  8. చివరిగా నిమ్మరసం అన్నిటి మీద పిండుకోవాలి..

నా చిట్కా:

సన్నకారపుస,పెరుగు కూడా వేసుకోవచ్చు..

Reviews for MASALA PURI Recipe in Telugu (0)