పావ్ భాజీ | Pax bhaji Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  6th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Pax bhaji recipe in Telugu,పావ్ భాజీ, Sree Vaishnavi
పావ్ భాజీby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

పావ్ భాజీ వంటకం

పావ్ భాజీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Pax bhaji Recipe in Telugu )

  • పావ్ ఒక పాకెట్
  • ఉల్లిపాయ ఒకటి పెద్దది
  • మిర్చి రెండు
  • కరివేపాకు ఒక రెమ్మ
  • టమాటాలు మూడు
  • ఉప్పు,కారం తగినంత
  • పసుపు కొంచెం
  • పావ్ భాజీ మసాలా రెండు చెంచాలు
  • అల్లంవెల్లుల్లి ముద్ద రెండు చెంచాలు
  • కొత్తిమీర ఒక కట్ట
  • నిమ్మకాయ ఒకటి
  • నూనె మూడు చెంచాలు
  • నెయ్యి రెండు చెంచాలు
  • ఆలూ మూడు
  • కారట్ 1 కప్పు
  • బీన్స్ 1 కప్పు
  • కాబేజ్ 1 కప్పు
  • పచ్చిబటానీ 1 కప్పు
  • కాలిఫ్లవర్ 1 కప్పు
  • కాప్సికం 1 కప్పు
  • పనీర్ 1 కప్

పావ్ భాజీ | How to make Pax bhaji Recipe in Telugu

  1. పాన్ లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ,మిర్చి,కరివేపాకు
  2. వేసి వేయించాలి
  3. ఇప్పుడు సన్నగా తరిగిన టమాట ముక్కలు వేసి బాగా మగ్గిన
  4. తరువాత అల్లం వెల్లుల్లిముద్ద,పసుపు,కారం,పావ్ భాజీ మసాలా వేసి
  5. నూనె తేలేవరకూ వేయించాలి.
  6. ఇప్పుడు తరిగిన కూరగాయలు అన్నీ వేసి రెండునిమిషాలు వేయించి
  7. తగినంత ఉప్పు,నీళ్ళు పోసి,మూతపెట్టి అయిదారు విజిల్స్ రానివ్వాలి.
  8. స్టీం పోయాక ఉడికిన కూరగాయలని మెత్తగా మెదిపి రెండునిమిషాలు
  9. కూర చిక్కబడేవరకూ ఉడికించి కొత్తిమీర చల్లి దింపెయ్యాలి.
  10. పావ్ ని మధ్యకి కట్ చేసి నెయ్యి వేడి చేసి పేనంపై కొంచెం వేయించాలి.
  11. వేడివేడిగా పావ్ లను కూరతో సర్వ్ చేస్తే ఘుమఘుమలాడే పావ్ భాజీ ఊరిస్తుంది.
  12. సర్వ్ చేసేటప్పుడు కూరలో నిమ్మరసం పిండి కొత్తిమీర చల్లాలి.

నా చిట్కా:

ఇలా కాకుండా ముందే ఆలూ,కూరగాయ ముక్కలు ఉడికించి కూడా కూర చేసుకోవచ్చు.

Reviews for Pax bhaji Recipe in Telugu (0)