స్వదేశీ మన్చూరియా | Motherland Manchuria Recipe in Telugu

ద్వారా Suma Malini  |  11th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Motherland Manchuria recipe in Telugu,స్వదేశీ మన్చూరియా, Suma Malini
స్వదేశీ మన్చూరియాby Suma Malini
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

స్వదేశీ మన్చూరియా వంటకం

స్వదేశీ మన్చూరియా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Motherland Manchuria Recipe in Telugu )

  • శెనగలు
  • క్యాబేజీ
  • అల్లం అర అంగుళం
  • పచ్చి మిర్చి 4
  • కరివేపాకు గుప్పెడు
  • వెల్లుల్లి 6 రేకులు
  • టమోట 1
  • ఖర్జూర పాకం 1 చెంచాడు
  • వేయించడానికి సరిపడా నూనె
  • లేదా కాల్చడానికి వెన్న పూస లేదా అలీవ్ ఆయిల్
  • నిమ్మరసం 1 చెంచాడు
  • జీలకర్ర 1 చెంచాడు

స్వదేశీ మన్చూరియా | How to make Motherland Manchuria Recipe in Telugu

  1. శెనగలు నానబెట్టి వాడేయాలి.
  2. క్యాబేజి సన్నగా తరగాలి.
  3. ఉల్లి, అల్లం, వెల్లుల్లి, మిర్చి చిన్నగా తరగాలి.
  4. కరీవేపాకు, జీలకర్ర కలిపి సన్నగా చిత్రీ పెట్టాలి.
  5. శెనగలు మెత్తగా రుబ్బుకోవాలి సన్నగా చిత్రించిన ఉల్లి అల్లం వెల్లుల్లి తరుగు సగం కలుపుకోవాలి.
  6. పిండి కూర ముక్కలు తో
  7. చిన్న ఉండలుగా చేసుకుని వేయించాలి.
  8. గుంటల మూకుడు వేడిచేసి వెన్న లేదా మీగడ రాసి కాల్చుకోవాలి.
  9. రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి.
  10. టమొట ముక్కలు ఉల్లి, వెల్లుల్లి, అల్లం, కరివేపాకు, జీలకర్ర తరుగు వేయించాలి.
  11. నిమ్మరసం పిండాలి.
  12. ఖర్జూర పాకం ఒక చెంచా డు వేయాలి.
  13. బాగా వేగనివ్వాలి.
  14. వేయించిన లేదా కాల్చిన మన్చూరియా కలపాలి.

నా చిట్కా:

గ్రేవీ కావాలి అనుకుంటే జొన్న పిండి నీళ్ళలో కలిపి పోసుకోవాలి. పిండి పల్చగా అయితే వరిపిండి కలుపుకోవాలి.

Reviews for Motherland Manchuria Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo