మామిడికాయ పులిహోర | Mango pulihora Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  19th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Mango pulihora recipe in Telugu,మామిడికాయ పులిహోర, Sree Vaishnavi
మామిడికాయ పులిహోరby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    19

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

మామిడికాయ పులిహోర వంటకం

మామిడికాయ పులిహోర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mango pulihora Recipe in Telugu )

  • బియ్యం ; ఒక కేజీ
  • మినపపప్పు ; 3 టేబుల్ స్పూన్స్
  • పల్లీలు : 2 టేబుల్ స్పూన్స్
  • ఉప్పు : 4 టీ స్పూన్స్
  • సెనగపప్పు : 4 టేబుల్ స్పూన్స్
  • అల్లం : 2అంగుళాల ముక్క
  • కరివేపాకు : 2 కట్టలు
  • ఎండుమిరపకాయలు : 15
  • పచ్చిమిరపకాయలు : 20
  • ఆవాలు : 2 టీ స్పూన్స్
  • మామిడికాయలు : 3
  • పసుపు : 2 టీ స్పూన్స్
  • ఇంగువ : 1 టేబుల్ స్పూన్
  • నూనె : 3 గరిటెలు

మామిడికాయ పులిహోర | How to make Mango pulihora Recipe in Telugu

  1. ముందుగ బియ్యం కడిగి ఉడికించి ఒక పెద్ద బేసిన్లో ఉండలుగా ఉండకుండా పొడిపొడిగా ఉండేట్టుగా అన్నం ఆరబెట్టాలి.
  2. తరువాత ఒక బాండి తీసుకుని 3 గరిటెల నునే పోసి అందులోనే మినపపప్పు ,సెనగపప్పు,ఆవాలు,ఇంగువ ,ఎండుమిరప ముక్కలు, పసుపు వేసి దోరగా వేయించాలి . అల్లం ముక్కని మెత్తగా గ్రైండ్ చెయ్యాలి .
  3. మామిడి కాయల పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా తరిగి , రుబ్బి పెట్టుకోవాలి.
  4. దోరగా వేగిన పోపులో పచ్చి మిరప ముక్కలు ,అల్లం,కరివేపాకు ,ఉప్పు వేసి ఒక నిముషం తరువాత గ్రైండ్ చేసిన మామిడికాయ గుజ్జుని వేసి ఐదు నిమిషాలు వేగాక చల్లార్చిన అన్నం లో వేసుకొని కలుపుకోండి.
  5. అంతే ఘుమగుమ లాడే వేడి వేడి మామిడికాయ పులిహోర రెడీ

Reviews for Mango pulihora Recipe in Telugu (0)