హోమ్ / వంటకాలు / బొంబాయి చట్నీ

Photo of BOMBAI CHUTNEY by Ram Ram at BetterButter
427
1
0.0(0)
0

బొంబాయి చట్నీ

Jun-19-2018
Ram Ram
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బొంబాయి చట్నీ రెసిపీ గురించి

బొంబాయి చట్నీ గా ప్రసిద్ధి చెందిన ఈ చట్నీ నిజంగా బొంబాయి రెసిపీ ఆ కదా నాకు తెలియదు కానీ ఈ డిష్ చేసుకోవటం ఎంత సులువు , తేలికో అంత కంటే రుచికరం అని మాత్రం బల్ల గుద్ది చెప్పగలను . ఈ చట్నీ పూరి, చపాతీ మరియు ఇడ్లీతో తినడానికి బాగుంటుంది. ఉదయం హడావుడి కి ఇది అనుగుణమైన రెసిపీ. మీ ఇంటి వారు ఎంతో సంతృప్తిగా తింటారు .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వాటితో పాటు తినేవి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 6

  1. శనగపిండి 5 టీ స్పూన్లు
  2. ఆవాలు 1స్పూన్
  3. జీలకర్ర 1స్పూన్
  4. మినపప్పు 1స్పూన్
  5. శనగపప్పు 1స్పూన్
  6. పచ్చి మిర్చి3
  7. చింతపండు రసం సరిపడా
  8. ఉప్పు సరిపడా
  9. కరివేపాకు ఒక రెమ్మ
  10. ఉల్లిపాయ ముక్కలు 2 చెంచాలు

సూచనలు

  1. పాన్ పెట్టి నూనె 3స్పూన్ల వేసి ఆవాలు , జీలకర్ర , మినపప్పు , శెనిగె పప్పు , కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించాలి .
  2. వేగినతర్వాత ఉల్లిపాయ ముక్కలువేసి వేయించి ఒక నిమిషం తరువాత చింతపండు రసం పులుపుకి సరిపడా వేసుకుని కొద్దిగా ఉప్పు , సరిపడా నీరు పోసుకొని మరిగించాలి.
  3. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి.తర్వాత శనగ పిండిని కొద్దీ నీటిలో ఉండలు లేకుండా కలుపుకుని మరుగుతున్న నీటిలో వేసి కలుపుకుంటు ఉండాలి. కొద్దిగా దగ్గర పడనివ్వాలి.
  4. అంతే ఎంతో రుచిగా ఉండే బొంబాయి చట్నీ రెడీ. మీరు చేసుకొని మీ అల్పాహారం తో భుజించి చూడండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర