దోసకాయ మామిడికాయ పచ్చడి | Cucumber mango chutney Recipe in Telugu

ద్వారా Sri Tallapragada Sri Devi  |  21st Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Cucumber mango chutney recipe in Telugu,దోసకాయ మామిడికాయ పచ్చడి, Sri Tallapragada Sri Devi
దోసకాయ మామిడికాయ పచ్చడిby Sri Tallapragada Sri Devi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

దోసకాయ మామిడికాయ పచ్చడి వంటకం

దోసకాయ మామిడికాయ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Cucumber mango chutney Recipe in Telugu )

  • చేదు లేని దోసకాయ 1
  • పుల్ల మామిడికాయ 1
  • పచ్చిమిరపకాయలు 5
  • శనగపప్పు 1 చెంచా
  • మినప్పప్పు 1 చెంచాడు
  • జీలకర్ర 1/2 స్పూన్
  • ఆవాలు 1/2 స్పూన్
  • నువ్వులు 2 చెంచాలు
  • పసుపు 1/8 చెంచా
  • కొత్తిమీర కొద్దిగా
  • నూనె పోపుకు సరిపడా
  • ఉప్పు రుచికి సరిపడ

దోసకాయ మామిడికాయ పచ్చడి | How to make Cucumber mango chutney Recipe in Telugu

  1. దోసకాయ , మామిడికాయ చెక్కు తీసి సన్నని ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి
  2. దోసకాయ గింజలు కొంచెం, మామిడికాయ ముక్కలు ,పచ్చిమిరపకాయలు ,కొత్తిమీర ,ఉప్పు ఒక మిక్సి జార్v లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి
  3. మూకుట్లో నూనె వేసి శనగపప్పు ,మినప్పప్పు, ఆవాలు ,జీలకర్ర ,నువ్వులు ఎర్రగా వేయించుకోవాలి
  4. ఈ పోపును ముందు గ్రైండ్ చేసుకున్న ముద్దతో కలిపి గ్రైండ్ చేసుకోవాలి
  5. ఈ ముద్దని దోసకాయ మామిడి కాయ ముక్కలు బాగా కలిపి ఒక అరగంట ఊరిన తర్వాత వడ్డించుకొని ఆనందించండి

నా చిట్కా:

వంట ఏదైనప్పటికి ఉప్పు కారాలు పులుపు మనింట్లో అలవాటును పట్టి వేసు వేసుకోవాలి

Reviews for Cucumber mango chutney Recipe in Telugu (0)