బ్రౌన్ రైస్ బిరియాని | Brown rice biriyani Recipe in Telugu

ద్వారా seetha Kumari sadhu  |  22nd Jun 2018  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
  • Brown rice biriyani recipe in Telugu,బ్రౌన్ రైస్ బిరియాని, seetha Kumari sadhu
బ్రౌన్ రైస్ బిరియానిby seetha Kumari sadhu
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

1

బ్రౌన్ రైస్ బిరియాని వంటకం

బ్రౌన్ రైస్ బిరియాని తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Brown rice biriyani Recipe in Telugu )

  • బ్రౌన్ రైస్ 1 కాప్
  • కాజు 10-15
  • పసుపు చిటికెడు
  • లవంగం 2-3
  • దాల్చినచెక్క 1/2 అంగుళం
  • మిరియాలు 2-3
  • నూనె 4-5 చెంచాలు
  • పుదీనా 1/4 కప్
  • కొత్తిమీర 1/3 కప్
  • అల్లం వెల్లులి ముద్ద ఒక చెంచా
  • జీలకర్ర ఒక చెంచా
  • పచ్చిమిర్చి 3-4
  • ఉల్లిపాయ ఒకటి
  • బఠాణి ఒక కప్
  • క్యారెట్ 1/2 కప్
  • నీళ్లు 4 కప్పులు
  • ఉప్పు తగినంత
  • కారం తగినంత
  • గరం మసాలా ఒక చెంచా
  • పెరుగు 1/2 కప్పు

బ్రౌన్ రైస్ బిరియాని | How to make Brown rice biriyani Recipe in Telugu

  1. ముందుగా బ్రౌన్ రైస్ ని బాగా కడుగుకోవాలి
  2. కడుకున తరువాత నీళ్లు పోసి అర గంట నానబెట్టుకోవాలి
  3. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె లో నూనె వేసుకొని కాచుకోవాలి
  4. కాగిన తరువాత అందులో జీలకర్ర ,దాల్చినచెక్క ,లవంగం ,మిరియాలు వేసి వేయించాలి
  5. అందులో వేగిన తరువాత జీడిపప్పు వేసి వేయించాలి
  6. వేగిన తరువాత అందులో ఉల్లిపాయ ,పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి
  7. వేగిన తరువాత చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి
  8. అందులో తరిగిన క్యారెట్ ,బఠాణి వేసి వేయించాలి
  9. అవి వేగే లోపు పొయ్యి మీద మళ్ళి ఒక గిన్నెపెట్టి అందులో నీళ్లు పోసి మరిగాక మీల్ మేకర్ వేసి ఉడికించుకోవాలి
  10. ఇప్పుడు ఉడికిన మీల్ మేకర్ అందులో వేసుకోవాలి
  11. వాటిని బాగా కలుపుకోవాలి
  12. అందులో ఇప్పుడు తగినంత ఉప్పు, కారం ,గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి
  13. కలుపుకుని తరువాత కొంచెం పెరుగు వసి బాగా కలుపుకోవాలి అందులో ఇప్పుడు నీళ్లు పోసి మరగనివ్వాలి
  14. మరిగిన తరువాత అందులో పుదీనా కొత్తిమీర బ్రౌన్ రైస్ ఉడికించాలి

Reviews for Brown rice biriyani Recipe in Telugu (1)

Sree Vaishnavi3 months ago

Wow
జవాబు వ్రాయండి