అటుకుల బిరియాని | Poha biriyani Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  23rd Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Poha biriyani recipe in Telugu,అటుకుల బిరియాని, Sree Vaishnavi
అటుకుల బిరియానిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

అటుకుల బిరియాని వంటకం

అటుకుల బిరియాని తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Poha biriyani Recipe in Telugu )

  • అటుకులు 1 కప్
  • క్యారెట్ 1 కప్
  • బీన్స్ 1/2 కప్
  • బఠాణి 1/2 కప్
  • ఉల్లిపాయ 1 కప్
  • మీల్ మేకర్ 1 కప్
  • పచ్చిమిర్చి 2-3
  • నూనె 2 చెంచాలు
  • అల్లం వెల్లులి ముద్ద 1 చెంచా
  • నీళ్లు 3 కప్పులు
  • ఉప్పు తగినంత
  • కారం 1 చెంచా
  • గరం మసాలా 1 చెంచా

అటుకుల బిరియాని | How to make Poha biriyani Recipe in Telugu

  1. ముందుగా అటుకులను నీళ్లలో మెత్తగా అయ్యే వరకు నానబెట్టుకోవాలి
  2. ఇప్పుడు ఒక బాండీ లో నూనె వేసి కాచుకోవాలి
  3. కాగిన తరువాత అందులో అల్లం వెల్లులి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి
  4. వేగిన తరువాత అందులో ఉల్లిపాయ వేసి వేగనివ్వాలి
  5. వేగిన తరువాత అందులో మిగిలిన కూరగాయ ముక్కలు వేసి బాగా వేయించాలి
  6. వేగిన తరువాత అందులో ఉప్పు ,కారం గరం మసాలా, వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి
  7. కలుపుకున్న తరువాత అందులో నానబెట్టిన అటుకులు వేసి బాగా కలుపుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే

నా చిట్కా:

అటుకులు ఎక్కువ నానకూడదు

Reviews for Poha biriyani Recipe in Telugu (0)