మామిడి కుల్ఫీ | Mango kulfi Recipe in Telugu

ద్వారా Pranali Deshmukh  |  26th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Mango kulfi recipe in Telugu,మామిడి కుల్ఫీ , Pranali Deshmukh
మామిడి కుల్ఫీ by Pranali Deshmukh
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    4

    గంటలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

మామిడి కుల్ఫీ వంటకం

మామిడి కుల్ఫీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mango kulfi Recipe in Telugu )

  • పాలు- 2 కప్పులు
  • పంచదార- ¼ కప్పు
  • కార్న్ ఫ్లోర్- 1 స్పూను
  • మామిడి పండు- 1
  • యాలకుల పొడి- కొద్దిగా
  • కుల్ఫీ కప్పులు- కావలసినన్ని

మామిడి కుల్ఫీ | How to make Mango kulfi Recipe in Telugu

  1. ముందుగా ¾ కప్పు పాలు తీసుకుని పొయ్యి మీద పెట్టి మరిగించాలి. అవి చిక్కగా మరిగిన తర్వాత దింపేసి పక్కన పెట్టుకోవాలి.
  2. తొక్క తీసిన మామిడి పండుని ముక్కలుగా కోసి మిక్సీలో వేసి మెత్తటి గుజ్జులా చేసుకోవాలి.
  3. ఇప్పుడు మిగిలిన పాలను, పంచదారను కలిపి గిన్నెలో పోసి పొయ్యి మీద పెట్టి మరిగించాలి.
  4. అవి బాగా మరిగి సగం అయ్యే సరికి కార్న్ ఫ్లోర్‌ని అందులో కలపాలి. ఇంకాసేపు మరిగించాలి
  5. తర్వాత ముందుగా మరిగించి పెట్టుకున్న చిక్కటి పాలను కూడా ఆ గిన్నెలో వేసి సన్నటి మంటపై ఉంచాలి. అడుగున అంటుకోకుండా గరిటతో తిప్పుతూ ఉండాలి.
  6. 5ని.లు ఆగాక యాలకుల పొడి వేసి దింపేయ్యాలి. చల్లారిన తర్వాత ఈ పాల మిశ్రమాన్ని ముందుగా పక్కన పెట్టిన మామిడి గుజ్జుని కలిపి మిక్సీలో వెయ్యాలి.
  7. ఇప్పుడు కుల్ఫీ కప్పులు తీసుకుని అందులో ఒక పుల్లని ఉంచి ఈ పాల మామిడి మిశ్రమాన్ని అందులో వేసి మూత పెట్టి డీ ఫ్రిజ్‌లో పెట్టాలి. 8గంటల తర్వాత తీసి తింటే ఖచ్చితంగా వారెవ్వా అనాల్సిందే..

Reviews for Mango kulfi Recipe in Telugu (0)