బొంబాయి చట్నీ | Bombay chutney Recipe in Telugu

ద్వారా Sri Tallapragada Sri Devi  |  27th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Bombay chutney recipe in Telugu,బొంబాయి చట్నీ, Sri Tallapragada Sri Devi
బొంబాయి చట్నీby Sri Tallapragada Sri Devi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

బొంబాయి చట్నీ వంటకం

బొంబాయి చట్నీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bombay chutney Recipe in Telugu )

  • ఉల్లిపాయ ఒకటి
  • టమాట ఒకటి
  • చిన్న క్యారెట్ ముక్క
  • రెండు పచ్చిమిరపకాయలు
  • చిన్న అల్లం ముక్క
  • కొద్దిగా కరివేపాకు
  • నాలుగు పెద్ద చెంచాల శెనగపిండి
  • రెండు గ్లాసుల నీళ్లు
  • రుచికి సరిపడా ఉప్పు
  • ఒక చెంచా నూనె
  • మినప్పప్పు ఒక చెంచా
  • ఆవాలు అర స్పూన్
  • కొద్దిగా జీలకర్ర
  • రెండు ఎండుమిరపకాయలు

బొంబాయి చట్నీ | How to make Bombay chutney Recipe in Telugu

  1. మొదట శెనగపిండిని పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి
  2. ఉల్లిపాయ టమోటా క్యారెట్ కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం ముక్క సన్నగా తరుక్కోవాలి
  3. స్టౌ మీద మూకుడు పెట్టి దానిలో ఒక చెంచా నూనె వేసి ఆవాలు మినప్పప్పు జీలకర్ర ఎండు మిరపకాయలు వేయించి మిరపకాయలు ఎర్రగా అయ్యాక ముందుగా ఉల్లిపాయలు అవి కొద్దిగా వేగాక అల్లం పచ్చిమిర్చి అవి కొద్దిగా వేగాక క్యారెట్ కరివేపాకు కొత్తిమీర ఉప్పువేసి మూత పెట్టాలి అవన్నీ బాగా మగ్గాలి
  4. కూరలు మగ్గాక రెండు గ్లాసుల నీళ్లు పోసి అవి మరిగాక సెనగపిండిని నీటిలో కలిప మరుగుతున్న నీటికి కలపాలి
  5. చక్కని రుచికరమైన బొంబాయి చట్నీ తయారయింది వేడివేడి ఇడ్లీలు కొద్దిగా నెయ్యి కలిపి తినేయడమే... ఇది దోశల లోకి కూడా చాలా బావుంటుంది

Reviews for Bombay chutney Recipe in Telugu (0)