నిమ్మ లేదా నారింజ కాయ కారం | Spicy lemon juice pickle Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  30th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Spicy lemon juice pickle recipe in Telugu,నిమ్మ లేదా నారింజ కాయ కారం, Indira Bhaskar
నిమ్మ లేదా నారింజ కాయ కారంby Indira Bhaskar
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

నిమ్మ లేదా నారింజ కాయ కారం వంటకం

నిమ్మ లేదా నారింజ కాయ కారం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Spicy lemon juice pickle Recipe in Telugu )

  • నిమ్మకాయ 6 లేదా నారింజ కాయలు 2
  • కారం ఒక పెద్ద స్పూన్లు
  • ఉప్పు ఒక పెద్ద స్పూన్
  • ఎండు మిరపకాయలు ఐదు
  • ఆవాలు ఒక స్పూను
  • మెంతులు ఒక స్పూను
  • ఇంగువ కొద్దిగా
  • పంచదార లేదా బెల్లం ఒక చెంచా
  • నూనె రెండు స్పూన్లు

నిమ్మ లేదా నారింజ కాయ కారం | How to make Spicy lemon juice pickle Recipe in Telugu

  1. ముందుగా నిమ్మకాయలను కట్ చేసి రసం తీసి పక్కన పెట్టాలి.
  2. ఇప్పుడు ఒక బాండీ పెట్టి అందులో నూనె వేసి ఆవాలు మెంతులు ఎండు మిరపకాయలు ఇంగువ వేసి బాగా వేయించాలి.
  3. ఇప్పుడు ఈ వేగిన మిశ్రమాన్ని మిక్సీలో వేసి పొడిలా చేసుకోవాలి.
  4. ఇప్పుడు పైన చేసుకున్న నిమ్మకాయరసంలో కారం ఉప్పు ఆవాలు మెంతులు పొడి పంచదార అన్నీ వేసి బాగా కలుపుకోవాలి.
  5. అంతే వేడివేడి అన్నంలో ను పప్పులో నలుచుకు తినే నిమ్మకాయ కారం రెడీ.

నా చిట్కా:

బెల్లం తీపి పదార్థం ఇష్టం లేని వాళ్ళు అది లేకుండా చేసుకోవచ్చు. ఇది ముద్దపప్పు తో తింటే చాలా బాగుంటుంది.

Reviews for Spicy lemon juice pickle Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo