క్రిస్పీ పొటాటో ఫింగర్ చిప్స్ | Crispy potato finger chips Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  1st Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Crispy potato finger chips recipe in Telugu,క్రిస్పీ పొటాటో ఫింగర్ చిప్స్, Indira Bhaskar
క్రిస్పీ పొటాటో ఫింగర్ చిప్స్by Indira Bhaskar
  • తయారీకి సమయం

    10

    గంటలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

క్రిస్పీ పొటాటో ఫింగర్ చిప్స్ వంటకం

క్రిస్పీ పొటాటో ఫింగర్ చిప్స్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Crispy potato finger chips Recipe in Telugu )

  • బంగాళదుంపలు 4
  • ఉప్పు ఒక చెంచాడు
  • నూనె-వేయించడానికి సరిపడినంత
  • కారం పావు చెంచా
  • మిరియాల పొడి కొద్దిగా

క్రిస్పీ పొటాటో ఫింగర్ చిప్స్ | How to make Crispy potato finger chips Recipe in Telugu

  1. ముందుగా బంగాళదుంపలను తొక్కతీసి పొడుగ్గా పలుచని ముక్కల తరుక్కోవాలి.
  2. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పెట్టి మరుగుతుండగా ముక్కల్ని వేసి కొద్దిగా ఉప్పు వేసి మరిగించి ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
  3. వీటిని ఇప్పుడు తడి లేకుండా తుడిచి ఫ్రిడ్జిలో ఒక పావుగంట సేపు ఉంచాలి.
  4. ఇప్పుడు ఒక బాండీలో నూనె వేసి మరిగించాలి.
  5. ఫ్రిజ్లోంచి తీసిన బంగాళదుంప ముక్కలు వేసి ఎరుపురంగు వచ్చేవరకు వేయించాలి.
  6. వీటిపైన ఉప్పు కారం మిరియాల పొడి చల్లుకుని తింటే వేడివేడి కరకరలాడే ఫింగర్ పొటాటో చిప్స్ రెడీ.

నా చిట్కా:

వేయించే ముందు వీటిపై కొద్దిగా మొక్కజొన్న పిండి జల్లి కూడా వేయించొచ్చు.

Reviews for Crispy potato finger chips Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo