క్రిస్పీ చిల్లీ బేబీకార్న్ | Crispy Chilli baby corn Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  1st Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Crispy Chilli baby corn recipe in Telugu,క్రిస్పీ చిల్లీ బేబీకార్న్, Indira Bhaskar
క్రిస్పీ చిల్లీ బేబీకార్న్by Indira Bhaskar
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

క్రిస్పీ చిల్లీ బేబీకార్న్ వంటకం

క్రిస్పీ చిల్లీ బేబీకార్న్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Crispy Chilli baby corn Recipe in Telugu )

  • బేబి కార్న్ 100 గ్రాములు
  • మైదాపిండి రెండు స్పూన్లు
  • కార్న్ ఫ్లోర్ 2 స్పూన్లు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్
  • కారం అర స్పూను
  • ఉప్పు పావు స్పూను
  • మిరియాలపొడి కొద్దిగా
  • ఏ డీప్ఫ్రైకి సరిపడా
  • గ్రేవీ కావాల్సిన పదార్ధాలు
  • అల్లం వెల్లుల్లి పాయ ముక్కలు ఒక చెంచా
  • చిన్న ఉల్లిపాయ ముక్కలు 1
  • క్యాప్సికమ్ ముక్కలు ఒక స్పూన్
  • పచ్చిమిర్చి ముక్కలు ఒక స్పూన్
  • టమాట సాస్ ఒక స్పూను
  • చిల్లి సాస్ ఒక స్పూను
  • సోయాసాస్ 1 స్పూను
  • స్ప్రింగ్ ఆనియన్స్ చిన్నగా తరిగినవి రెండు స్పూన్లు
  • కొత్తిమీర కొద్దిగా

క్రిస్పీ చిల్లీ బేబీకార్న్ | How to make Crispy Chilli baby corn Recipe in Telugu

  1. ముందుగా బేబీ కార్న్ నిమిషాలు మధ్యలోకి చీల్చి చిన్న ముక్కలుగా కట్ చేయాలి.
  2. ఇప్పుడు ఒక గిన్నెలోకి మైదాపిండి , కార్న్ ఫ్లోర్, అల్లంవెల్లుల్లి ముద్ద,ఉప్పు కారం మిరియాల పొడి వేసి అన్నీ కలిపి కొద్దిగా నీరు పోసి వేసి ముద్దలా చేయాలి.
  3. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న బేబీకార్న్ ముక్కలను ముంచి ఉంచాలి.
  4. ఇప్పుడు ఆయిల్ వేసి మూకుట్లో బాగా కాగనివ్వాలి.
  5. ఇవి కాగాక ముందుగా సిద్ధం చేసుకున్న బేబీకార్న్ ముక్కలు నూనెలో వేసి చిన్న మంట మీద దోరగా వేయించాలి.
  6. ఇప్పుడు గ్రేవీకోసం ఒక వాన నీళ్ళు కొద్దిగా నూనె వేసి అందులో చిన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి వేగనివ్వాలి.
  7. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు వేసి కొంచెం సేపు వేగాక పచ్చిమిర్చి వెయ్యాలి.
  8. ఇప్పుడు అందులో కారం కొద్దిగా ఉప్పు వేసి వేగనివ్వాలి.
  9. ఇప్పుడు ఈ మిశ్రమంలో టమాటా సాస్ చిల్లి సాస్ సోయాసాస్ ఒక్క స్పూన్ వేసి బాగా కలపాలి.
  10. ఇప్పుడు ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకుని కొద్దిగా నీరు పోసి దానిని పల్చగా చేసి పైన మరుగుతున్న దాంట్లో వెయ్యాలి.
  11. ఇది కొంచెం సేపు మగ్గాక పైన స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీరతో అలంకరించి సర్వ్ చేస్తే ఎంతో రుచిగా ఉండే చిల్లి బేబీకార్న్ రెడీ.

నా చిట్కా:

దీనిని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.

Reviews for Crispy Chilli baby corn Recipe in Telugu (0)