బెల్లం గవ్వలు | Bellam gavvalu Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  1st Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Bellam gavvalu recipe in Telugu,బెల్లం గవ్వలు, Sree Vaishnavi
బెల్లం గవ్వలుby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    16

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

బెల్లం గవ్వలు వంటకం

బెల్లం గవ్వలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bellam gavvalu Recipe in Telugu )

  • మైదాపిండి... ఒక కేజీ
  • బెల్లం... ఒక కేజీ
  • బొంబాయి రవ్వ... ఒక కేజీ
  • వెన్నపూస... 8 టీ.
  • నూనె... తగినంత

బెల్లం గవ్వలు | How to make Bellam gavvalu Recipe in Telugu

  1. మైదాను బాగా జల్లించాలి. బొంబాయిరవ్వను మైదాకు కలిపి వెన్నపూసను కరిగించి కలపాలి.
  2. ఈ పిండిలో కొద్దిగా నీళ్లుపోసి చపాతీ పిండిలాగా బాగా కలపాలి.
  3. ఈ పిండిని రెండు గంటలపాటు అలాగే ఉంచి గవ్వల అచ్చుతో గవ్వలు చేసుకోవాలి.
  4. పొయ్యిమీద బాణలిపెట్టి తగినంత నూనె పోసి బాగా కాచాలి.
  5. అందులో ఈ గవ్వలను వేసి ఎర్రగా వేయించి తీసేయాలి.
  6. గిన్నెలో బెల్లం వేసి తగినన్ని నీళ్లుపోసి తీగమాదిరిగా పాకం వచ్చేలా చేయాలి.
  7. తరువాత ఈ పాకాన్ని స్టవ్‌మీద నుంచి కిందకు దించి వేయించి ఉంచుకున్న గవ్వలను అందులో వేసి, మొత్తం గవ్వలన్నింటికీ పాకం పట్టేలా బాగా కలియబెట్టాలి.
  8. అంతే బెల్లం గవ్వలు రెడీ అయినట్లే...!

Reviews for Bellam gavvalu Recipe in Telugu (0)