బూడిద గుమ్మడికాయ అట్టు | White pumpkin dosa Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  1st Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • White pumpkin dosa recipe in Telugu,బూడిద గుమ్మడికాయ అట్టు, Indira Bhaskar
బూడిద గుమ్మడికాయ అట్టుby Indira Bhaskar
  • తయారీకి సమయం

    10

    గంటలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

బూడిద గుమ్మడికాయ అట్టు వంటకం

బూడిద గుమ్మడికాయ అట్టు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make White pumpkin dosa Recipe in Telugu )

  • ఒక చిన్న గ్లాసుడు మినప్పప్పు
  • ఇంగువ పొడి పావు స్పూను
  • ఎండుమిరపకాయలు 6
  • బూడిద గుమ్మడికాయ ముక్కలు రెండు కప్పులు
  • ఉప్పు 2చెంచాలు
  • నూనె 4 చెంచాలు

బూడిద గుమ్మడికాయ అట్టు | How to make White pumpkin dosa Recipe in Telugu

  1. మినపప్పుని ఒక నాలుగు గంటలు నానబెట్టి మెత్తగా పిండి రుబ్బు కోవాలి.
  2. బూడిద గుమ్మడికాయ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు వేసి ఒక బట్టలో కట్టి నీరంతా పోయేవరకు రాత్రంతా ఉంచాలి.
  3. ఇప్పుడు పచ్చిమిర్చి లేదా ఎండుమిరపకాయలు అని పేస్టులా చేసి పక్కన పెట్టాలి.
  4. ఇప్పుడు మినప్పిండిలో బూడిద గుమ్మడికాయ ముక్కలు ఎండు మిర్చి పేస్ట్ ఉప్పు ,ఇంగువ వేసి ఒక ముద్దలా చేసుకోవాలి.
  5. ఇప్పుడు ఒక పెనం పెట్టి దాని మీద నూనె వేసి ఈ మిశ్రమాన్ని అట్టు లాగా వేసి ఎర్రగా రెండువైపులా కాల్చుకోవాలి గుమ్మడికాయ అట్టు రెడి.

నా చిట్కా:

గుమ్మడికాయ వడియాలు అందుబాటులో లేనప్పుడు ఈ అట్లు వేసుకుని తింటే ఒడియాల లాగా ఉంటాయి.

Reviews for White pumpkin dosa Recipe in Telugu (0)